ఫ్లిప్‌కార్ట్‌లో పండగే పండుగ... దేనిపై ఆఫర్లు పెట్టారో తెలుసా

గురువారం, 18 ఏప్రియల్ 2019 (14:04 IST)
పోటాపోటీగా ఆఫర్లు ప్రకటించడంలో ముందుండే ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తాజాగా టీవీ ధరలపై కళ్లు చెదిరిపోయే ఆఫర్లను అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ టెలివిజన్ సేల్‌ పేరుతో వివిధ రకాల కంపెనీలకు చెందిన టీవీలపై సూపర్ డీల్‌లలో భారీగా డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఈ సేల్ ఏప్రిల్ 18మ ప్రారంభమై, 20 వరకు అందుబాటులో ఉండనుంది. నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్చేంజ్ ఆఫర్, డిస్కౌంట్ వంటి ప్రయోజనాలను కూడా ఇందులో అందించడం జరిగింది. 
 
నేడు మొదలైన ఫ్లిప్‌కార్ట్ టెలివిజన్ డే సేల్‌‌లో ఎంఐ, వీయూ, శాంసంగ్, కొడక్, జేవీఎసీ, ఐఫాల్కన్, మార్క్‌క్యూ, ఎల్‌జీ, మైక్రోమ్యాక్స్, పానాసోనిక్, థామ్సన్, సోనీ వంటి వివిధ కంపెనీల టీవీలపై ఉత్తమ డీల్‌లలో మీకు కావాల్సిన టీవీలను స్వంతం చేసుకోవచ్చు. ఈ సేల్‌లో అందిస్తున్న టీవీల ప్రారంభ ధర రూ.6,499గా ఉంది. 
 
ఎంఐ 4ఏ ప్రో 32 అంగుళాల స్మార్ట్‌టీవీని రూ.12,999కు అందిస్తుండగా, వీయూకు చెందిన 32 అంగుళాల హెచ్‌డీ రెడీ టీవీని రూ.10,499కే అందిస్తున్నారు. ఐఫాల్కన్ 32 అంగుళాల హెచ్‌డీ స్మార్ట్‌టీవీని రూ.11,999కి స్వంతం చేసుకోవచ్చు. ఇక కొడక్ 32 అంగుళాల టీవీని రూ.8,999కే తీసుకోవచ్చు. ఇదే విధంగా పెద్ద టీవీలపై కూడా భారీగా డిస్కౌంట్‌లు అందిస్తున్నారు. ఈ సేల్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి మొదలుకానుంది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం భర్త నల్లగా ఉన్నాడనీ పెట్రోల్ పోసి నిప్పంటించాడు..