అమెజాన్‌ హోలీ సేల్‌: స్మార్ట్‌ఫోన్లపై భారీ రాయితీలు...

బుధవారం, 20 మార్చి 2019 (15:40 IST)
ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్ మరోసారి డిస్కౌంట్‌ అమ్మకాలకు తెరతీసింది. హోలీ పండుగ సందర్భంగా ది గ్రేట్ అమెజాన్ హోలీ సేల్‌ 2019  పేరిట ఆకర్షణీయమైన ఆఫర్లను అందజేస్తోంది.
 
ఇందులోభాగంగా... శామ్‌సంగ్‌ గెలాక్సీ ఎం20,  రియల్‌ మి యూ, హువాయి వై 9, వివో 5ప్రొ స్మార్ట్‌ఫోన్లను తగ్గింపు ధరల్లో వినియోగదారులకు అందుబాటులో ఉంచింది. దీంతోపాటు  అమెజాన్ పే, ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులపై రూ.3వేలు దాటిన కొనుగోళ్లపై నోకాస్ట్‌ ఈఇంఐ, యాక్సిస్ బ్యాంకు క్రెడిట్‌ కార్డుపై 5 శాతం తక్షణ డిస్కౌంట్‌లను ఆఫర్‌ చేస్తోంది. అలాగే  డెబిట్‌ కార్డు కొనుగోళ్లపై నో ఈఎంఐ,  5,400 రూపాయల విలువైన తక్షణ క్యాష్‌ బ్యాక్, 3టీబీ జియో డేటాను అందివ్వనుంది. 
 
అయితే వీటితోపాటు హోలీ స్టోర్ పేరుతో ప్రకటించిన సేల్‌లో గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్‌‌లను ప్రకటించి... గ్యాడ్జెట్లను కూడా అత్యంత తక్కువ ధరలకే అందిస్తోంది. ఈ సేల్‌ 21వ తేదీ వరకు కొనసాగనుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు

తర్వాతి కథనం చైనాకు చెక్ పెట్టేందుకు సిద్ధమవుతున్న ఈయూ