Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమేజాన్‌లో కేజీఎఫ్... ట్రోలింగ్ మామూలుగా లేదు... డోకు వస్తోంది...

Advertiesment
Users
, సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (17:56 IST)
కేజీఎఫ్ పుణ్యమా అని పాపం అమెజాన్‌ని నెటిజెన్లు తిట్టరాని తిట్లు తిట్టేస్తున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా అధికారిక ప్రకటన చేసి వెంటనే మాట మార్చేసి అడ్డంగా దొరికిపోయిన ఆ సైట్‌కి తిట్ల పర్వం చాలా దారుణంగా ఉంటోంది.
 
అసలు విషయానికి వస్తే.. కన్నడ చలనచిత్ర రంగంలో రాకింగ్ స్టార్ యాష్ హీరోగా నటించిన ‘కేజీఎఫ్’ సినిమా కన్నడనాట బ్లాక్ బస్టర్ హిట్ సినిమాగా రికార్డులని సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సినిమా తెలుగులో కూడా అన్నివర్గాల ప్రేక్షకులకు చేరువ కావడంతో రూ. 10 కోట్ల షేర్‌ని వసూలు చేసింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా రూ 230 కోట్లను రాబట్టి.. రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిన మొట్టమొదటి శాండల్ ఉడ్ మూవీగా చరిత్రను తిరగవ్రాసింది. ఈ ఒక్క సినిమాతోనే యాష్ ప్రపంచం దృష్టిని ఆకర్షించి క్రేజీ స్టార్‌గా మారిపోయారు. 
 
ఈ సినిమా ఇప్పటికీ కన్నడలో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది అంటే యాష్‌కి ఉన్న క్రేజ్ ఏంటో ఈపాటికి అర్ధమయ్యే ఉంటుంది. ఇక ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘కేజీఎఫ్ 2’ కూడా రాబోతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల్ని ప్రముఖ అమేజాన్ ఫ్రైమ్‌ సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమాని ఫిబ్రవరి 5 నుండి అమేజాన్ ప్రైమ్‌ ద్వారా అందుబాటులో ఉంచుతామని అమెజాన్ ట్విట్టర్‌లో అధికారికంగా ప్రకటించారు. 
 
అయితే ‘కేజీఎఫ్’ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి అమెజాన్ సంస్థ కాస్త అత్యుత్సాహం ప్రదర్శించి... 5000 రీట్వీట్‌లు చేస్తే చిత్రాన్ని అమేజాన్ ప్రైమ్‌లో ఉంచుతామని ట్వీట్ చేసింది. కాగా ‘కేజీఎఫ్’‌కి ఉన్న క్రేజ్‌తో కొన్ని గంటల వ్యవధిలోనే 5000 రీట్వీట్స్‌ను పోటీపడి చేసేసారు నెటిజన్లు. 
 
అయితే ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్... అమెజాన్ సంస్థ ముందుగా చేసిన ట్వీట్‌ని ఎడిట్ చేసి ‘అనౌన్స్’ అన్న పదాన్ని కొట్టేసి ఆ ప్లేస్‌‌లో ‘రిలీజ్ డేట్’ అంటూ మాట మార్చడంతో నెటిజన్లకు చిర్రెత్తుకొచ్చి అమేజాన్‌ ప్రైమ్‌ని ఓ ఆట ఆడుకుంటూ ట్రోల్ చేసేస్తున్నారు. ట్రోలింగ్‌లకుతోడు తమ క్రియేటివిటీని జోడిస్తూ.. ఫన్నీ ఫన్నీ ట్వీట్‌లతో పాటు తిట్ల దండకం కూడా అందుకుంటున్నారు. అవన్నీ చదివితే జంధ్యాలగారి సినిమా... ఇవివి సినిమాలు చూసినట్లే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంటిని కాపాడలేని వారు దేశాన్ని ఎలా?: నితిన్ గడ్కరీ