Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయశాంతి అంత కావాలంటోందా?

Webdunia
గురువారం, 25 ఏప్రియల్ 2019 (18:31 IST)
విజయశాంతి... నిన్నటితరం కథానాయికగా వెండితెరపై ఒక వెలుగు వెలిగుతూ.... అగ్ర కథానాయకులందరి సరసన నటించి అనేక విజయాలను సొంతం చేసుకున్న మీదట అక్కడ నుండి మళ్లీ లేడీ ఓరియంటెడ్ సినిమాల వైపుకి తిరిగి ఆ రంగంలోనూ విజయం సాధించేసిన విషయం అందరికీ తెలిసిందే. 
 
కాగా... ఆ తర్వాతి కాలంలో రాజకీయాలకి ప్రాధాన్యతనివ్వడంతో సినిమాలను, సినీ రంగాన్ని దాదాపు దూరం పెట్టేసారనే చెప్పాలి. అలా చాలం కాలంగా నటనకి దూరమైన విజయశాంతిని తిరిగి సినీ పరిశ్రమలోకి... రీ ఎంట్రీ ఇప్పించేందుకు అనిల్ రావిపూడి ప్రయత్నించి సక్సెస్ అయినట్లుగా వార్తలు గుప్పుమంటున్నాయి.
 
వివరాలలోకి వెళ్తే... మహేశ్ బాబు కెరీర్‌లోని 26వ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం విజయశాంతి అయితేనే బాగుంటారని భావించిన ఆయన ఆమెను సంప్రదించి ఒప్పించడం జరిగిందనే వార్తలు గుప్పుమంటున్న నేపథ్యంలో... విజయశాంతికి గల క్రేజ్ తెలిసిందే గనుక, ఆమెకి పారితోషికంగా ఎంత ముడుతుందనే మాట ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 
 
కాగా... ఈ సినిమా కోసం ఆవిడ 2 కోట్లు అడిగారనీ, కోటి నుంచి కోటిన్నర ఆమెకు ముట్టనుందని ఫిల్మ్ నగర్‌లో చెప్పుకుంటున్నారు. అంటే దాదాపు ఒక స్టార్ హీరోయిన్‌కి అందేంత పారితోషికం విజయశాంతికి ఈ రీఎంట్రీ ద్వారా ముట్టబోతోందన్న మాట. ఎంతైనా లేడీ అమితాబ్ రూటే వేరుగా మరి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతిలో అభివృద్ధి పనుల పునఃప్రారంభం: జగన్‌ను తప్పకుండా ఆహ్వానిస్తాం

రోడ్డు ప్రమాదం: వెంటనే స్పందించిన నాదెండ్ల మనోహర్

Hyderabad, పివిఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ హైవే ఫ్లై ఓవర్ నుంచి వేలాడిన తాగుబోతు (video)

భారత్ పర్యటనలో జేడీ వాన్స్.. అక్షరధామ్ ఆలయంలో వాన్స్ ఫ్యామిలీ

'నేను ఓ రాక్షసుడుని చంపేశాను' : కర్నాటక మాజీ డీజీపీ హత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

తర్వాతి కథనం
Show comments