Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ పుట్టినరోజు.. రామ్ ఆసక్తికర ట్వీట్.. గంటా శుభాకాంక్షలు

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ పుట్టినరోజు.. రామ్ ఆసక్తికర ట్వీట్.. గంటా శుభాకాంక్షలు
, బుధవారం, 24 ఏప్రియల్ 2019 (11:38 IST)
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు నేడు పుట్టిన రోజు. 1973 ఏప్రిల్‌ 24న జన్మించిన సచిన్‌కు నేటితో 46 ఏళ్లు నిండాయి. సచిన్ పుట్టినరోజు దేశవ్యాప్తంగా ఆయన అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు. ట్విట్టర్ ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. క్రికెట్ దేవుడు సచిన్‌కు సోషల్ మీడియాలో ప్రముఖులు, క్రికెట్ అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.  
 
భారత క్రికెట్ జట్టులో సుదీర్ఘ ప్రస్థానాన్ని కొనసాగించిన సచిన్ పేరిట ఎన్నో రికార్డులు వున్నాయి. 24 సంవత్సరాల పాటు టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన సచిన్.. 200 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 15,921 పరుగులు సాధించారు. అలాగే 463 వన్డేల్లో 18,426 పరుగులు సాధించారు. ప్రపంచ క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా చరిత్రకెక్కారు. అంతర్జాతీయ క్రికెట్‌లో 30వేల పరుగులు చేసిన ఏకైక ఆటగాడు సచిన్ టెండూల్కరే కావడం విశేషం. 
 
క్రికెట్‌కు సచిన్ అందించిన సేవలకు గుర్తుగా 1994లో అర్జున అవార్డు, 1997లో రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న అవార్డు దక్కింది. పద్మశ్రీ, పద్మవిభూషణ్ అవార్డులు కూడా మాస్లర్ బ్లాస్టర్‌ను వరించాయి. 2012 డిసెంబర్లో ఇంటర్నేషనల్ వన్డే మ్యాచ్‌లకు సచిన్ రిటైర్‌మెంట్ ప్రకటించారు. 2013 అక్టోబర్‌లో క్రికెట్‌‌కు సచిన్ వీడ్కోలు పలికారు. అదే ఏడాది నవంబరు 16న దేశ అత్యున్నత పౌర పురస్కారం "భారత రత్న"ను అందుకున్నారు.
 
ఇకపోతే.. సచిన్ టెండూల్కర్‌కు టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రామ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఆత్మహత్యలు చేసుకుంటోన్న ఇంటర్ విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని ట్వీట్ చేశారు.
 
''పార్క్‌లో కూర్చుని బిస్కెట్లు తినే పిల్లలకి ఎలా చెప్పినా వింటారు. బెడ్‌రూమ్‌ లాక్ వేసుకుని లైఫ్ ఎలా రా అనుకునే పిల్లలకి.. నిజాలు.. ఇలా చెప్తేనే వింటారు. ఇంటర్ కూడా పూర్తి చేయని, దేశం గర్వించదగిన వ్యక్తి సచిన్ టెండూల్కర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు'' అని రామ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అంటే, ఇంటర్ కూడా పూర్తిచేయని సచిన్ టెండూల్కర్ గొప్ప క్రికెటర్‌గా ఎదిగినప్పుడు.. పరీక్షల్లో ఫెయిలైనంత మాత్రాన ఆత్మహత్యలు చేసుకోవడం ఏంటని పరోక్షంగా రామ్ ప్రశ్నించారు.
webdunia
 
మరోవైపు టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు సచిన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సచిన్ చిరకాలం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. యువతకు సచిన్ గొప్ప స్ఫూర్తి ప్రదాత అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా టీమిండియా జెర్సీతో ఉన్న సచిన్ ఫొటోలను గంటా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బతికున్నంత కాలం బెంగళూరు తరపునే ఆడాలనుకుంటున్నా: చాహల్