Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్ 'మన్మథుడు'తో 'గుంటూరు టాకీస్' బ్యూటీ

Webdunia
గురువారం, 27 మే 2021 (12:23 IST)
బుల్లితెర బ్యూటీ రష్మీ యాంకర్. పలు చిత్రాల్లో నటించింది. ముఖ్యంగా, 'గుంటూరు టాకీస్' చిత్రంలో ఈ అమ్మడు రెచ్చిపోయింది. ఈమెకు అటు బుల్లితెరపైనా, ఇటు వెండితెరపైనా మంచి క్రేజ్ ఉంది. యువతలో మంచి ఫాలోయింగ్ వుంది. 
 
ఆ క్రేజ్ ఆమెకి సినిమాల్లో అవకాశాలు కూడా తెచ్చిపెట్టింది. నాయిక ప్రధానమైన హారర్ .. సస్పెన్స్ థ్రిల్లర్లు కూడా చేసింది. అయితే ఆ సినిమాల్లో ఒకటి రెండు మాత్రమే ఆమెకి స్సక్సెస్‌ను తెచ్చిపెట్టాయి.. మిగతా సినిమాలు పరాజయం పాలయ్యాయి. 
 
దీంతో ఆమెకు సినీ అవకాశాలు బాగా తగ్గిపోయాయి. అయినప్పటికీ సినిమాలపై దృష్టి పెడుతూనే, బుల్లితెరపై ఆమె తన జోరును కొనసాగిస్తూనే ఉంది. సినీమా ఛాన్సుల కోసం ముమ్మరంగా ప్రయత్నిస్తూనే వుంది. 
 
ఈ నేపథ్యంలో తాజాగా టాలీవుడ్ 'మన్మథుడు' నాగార్జున సినిమాలో ఒక అవకాశాన్ని దక్కించుకున్నట్టుగా ప్రచారం సాగుతోంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించే ఈ యాక్షన్ సినిమా 'గోవా'లో మొదటి షెడ్యూల్ షూటింగు జరుపుకుంది. తదుపరి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో ప్లాన్ చేశారు. 
 
ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం రష్మీని తీసుకున్నారట. గతంలో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రష్మీ 'గుంటూరు టాకీస్' చేసింది. ఆ పరిచయం కారణంగానే ఆమెకి ఈ సినిమాలో ఛాన్స్ దక్కిందని చెప్పుకుంటున్నారు. ఇందులో వాస్తవమెంతో వేచిచూడాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దువ్వాడ, మాధురి పబ్లిక్‌గా చేస్తే తప్పులేదు కానీ నేను ఖైదీని కౌగలించుకుంటే తప్పా?

విజయవాడ సింగ్ నగర్ డాబాకొట్లు రోడ్డులో పడవలు, బెంబేలెత్తుతున్న ప్రజలు

మా ఆయనకు మహిళల పిచ్చి, 30 మందితో డేటింగ్, అందుకే చనిపోతున్నా...

ఉపరాష్ట్రపతి ఎన్నికలు : ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి

పవన్ కళ్యాణ్‌ అంత పని చేశారా? హైకోర్టులో పిటిషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments