ఇటీవల కరోనా విలయతాండంతో సినిమా థియేటర్లను లీజుకు తీసుకున్న ఆ నలుగురు పెద్ద సవాల్‌ను ఎదుర్కొంటున్నారు. థియేటర్లు మూతపడడంతో వాటిని స్వంతదారులకు ఇచ్చేయటమే బెటర్ అనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసిందే. ఇప్పుడు దిల్‌రాజు ఆ ఆలోచనలో వున్నారు. అందుకే మరో ప్రత్యామ్నాయం వైపు ఆయన దృష్టి పెట్టారు. అదే ఓటీటీ. ఈమధ్య ఓటీటీలు చాలామంది పెట్టేస్తున్నారు. రీసెంట్‌గా వర్మ కూడా ఓటీటీ వైపు మళ్ళారు. అందుకే తాను కూడా ఓటీటీ పెట్టాలని దిల్‌రాజు నిర్ణయానికి వచ్చినట్లు సన్నిహితులు చెబుతున్నారు.
ఇప్పటికే అల్లు అరవింద్ నెలకొల్పిన ఆహా! ఓటీటీలో దిల్‌రాజు కుమార్తె, అల్లుడు కూడా పార్లనర్సే. వారి అనుభవం తనకు ఎలాగూ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఇంకోవైపు పరిశ్రమలోని ఆ నలుగురు కూడా ఓటీటీవైపు చూస్తున్నారు. ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్ సొంత ఓటీటీని పెట్టాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీనికి సమంత కూడా భాగస్వామి అవుతుంది. అదేవిధంగా దిల్‌రాజు ఓటీటీకి ఆయన కూతురు, అల్లుడు టెక్నికల్ విషయాలు చూసుకోనున్నారట. ఇప్పటికే దిల్‌రాజుకు సంబంధించిన టీమ్ అన్ని పనులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక నాగార్జున అయితే ఇప్పటికే టెక్నికల్ నైపుణ్యం వున్న టీమ్ ఆయన వద్ద వున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో శిక్షణాసంస్థను కూడా గత కొద్దికాలంగా నిర్వహిస్తున్నారు. ఎలాగూ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ కు చెందిన సిబ్బంది కూడా ఉపయోగపడతారు. వీరిద్దరూ ఓటీటీపి పెడితే, ఆ వెంటనే సురేష్‌బాబుకూడా పెట్టక తప్పదు. ఎందుకంటే రానాకకూ సాంకేతిక పరిజ్ఞానం బాగా వుంది. ఆయనకు ప్రత్యేకమైన టీమ్ కూడా వుంది. బాహుబలి సినిమాకు సంబంధించిన కొంతమంది టీమ్ ఆయన కాంపౌండ్ మనుషులే. సో. ముందుముందు అంతా ఓటీటీమయం అవనున్నదన్నమాట. మరి థియేటర్లు ఏమయిపోతాయో?