Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ర‌ణ‌భీర్‌తో రొమాన్స్ నా క‌లః స‌మంత

Advertiesment
ర‌ణ‌భీర్‌తో రొమాన్స్ నా క‌లః స‌మంత
, బుధవారం, 26 మే 2021 (12:22 IST)
Samantha (Ig)
స‌మంత అక్కినేని న‌టిగా ఎవ‌ర్ గ్రీన్‌. ఆమె చేస్తున్న పాత్ర భిన్నంగా వుండాల‌ని చూసుకుంటుంది. అందుకే వివాహం అయ్యాక మంచి క‌థ‌లు ఎంపిక చేసుకుంటుంది. ఇటీవ‌లే వెబ్ సిరీస్‌లోకి కూడా ప్ర‌వేశించిది. `ద ఫ్యామిలీ మెన్‌2` అనే వెబ్‌సిరీస్ కూడా విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇటీవ‌లే ట్రైల‌ర్ విడుద‌లైంది. ఇందులో రాజీ అనే త‌మిళ రెబ‌ల్ ప్ర‌తినాయిక‌గా ఆమె న‌టించింది. దీని ద్వారా ఆమె బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నంద‌న్న‌మాట‌.
 
అయితే గ‌తంలో కూడా ఆమెకు బాలీవుడ్‌లో సినిమా ఆఫ‌ర్లు వ‌చ్చాయి. కానీ వాటిని తిర‌స్క‌రించింది. బాలీవుడ్‌లో అద్భుత‌మైన న‌టీట‌నులు వున్నారు. ఆ పోటీలో నేను రాణించ‌గ‌ల‌నా? అనేది అనుకునేదానిని. అందుకే అవ‌కాశాలు వ‌చ్చినా వ‌ద్ద‌నుకున్నా. కానీ ద‌ర్శ‌క ద్వ‌యం రాజ్‌డి.కె. లు చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో ఫ్యామిలీమెన్ సిరీస్ చేశాను. ట్రైల‌ర్ విజ‌య‌వంతంగా పేరు వ‌చ్చిందంటే నేను స‌క్సెస్ అయిన‌ట్లేన‌ని అంటోంది. 
 
పైగా ఇందులో మ‌నోజ్‌వాజ్‌పాయ్ పాత్ర‌ను తెలుగులో ఎవ‌రు చేస్తే బాగుంటుంద‌ని స‌మంత‌ను అడిగితే, ఠ‌క్కున నాగార్జున మామ‌య్య అంటూ తెలియ‌జేసింది. అయితే హిందీలో సినిమా చేయాల‌నుంది. అది కూడా ర‌ణ‌భీర్‌క‌పూర్‌తో రొమాంటిక్ సినిమా చేయాల‌నేది నా క‌ల అంటూ వెబ్ సిరీస్ సంద‌ర్భంగా జ‌రిగిన ఇంట‌ర్వ్యూలో స‌మంత స్ప‌ష్టం చేసింది. ఇక ఫ్యామిలీ మేన్2 జూన్ 3న ఓటీటీలో విడుద‌ల కాబోతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల అన్ని జిల్లాల్లో ఆక్సిజన్ బ్యాంకులు : చిరంజీవి