Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జూన్ 4న 'ది ఫ్యామిలీ మ్యాన్' కొత్త సీజన్‌, సమంత అక్కినేని లుక్ అదుర్స్

Advertiesment
జూన్ 4న 'ది ఫ్యామిలీ మ్యాన్' కొత్త సీజన్‌, సమంత అక్కినేని లుక్ అదుర్స్
, బుధవారం, 19 మే 2021 (12:32 IST)
ది ఫ్యామిలీ మ్యాన్ నూతన సీజన్ మరింత భారీ స్థాయిలో, భారీ అంచనాలతో, మరింత దూకుడుగా రూపుదిద్దుకోనుంది. భారతదేశంలో, 240 దేశాలు, టెరిటరీస్‌లలో అమెజాన్ ప్రైమ్ వీడియోపై 
ఈ షో ప్రసారం కానుంది.
 
స్వేచ్ఛా ఆలోచనాధోరణుల ద్వయం రాజ్ మరియు డీకేలచే రూపొందించబడిన అమెజాన్ ఒరిజినల్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ నూతన సీజన్ సూపర్ స్టార్ సమంతా అక్కినేని డిజిటల్ రంగప్రవేశానికి వేదిక కానుంది. పద్మశ్రీ అవార్డు గ్రహీత మనోజ్ బాజ్ పేయి, ప్రియమణి, షారిబ్ హష్మి, సీమా బిశ్వాస్‌లతో పాటుగా ఆమె కూడా ఈ షో తారాగణంలో చేరనున్నారు.
 
కోట్లాది మంది అభిమానులకు ఆనందాన్ని అందిస్తూ, ఎంతగానో ప్రశంసంలు పొందిన రాజ్ & డీకే యొక్క ది ఫ్యామిలీ మ్యాన్ కొత్త సీజన్ విడుదల తేదీని 4th June 2021గా అధికారికంగా ప్రకటించింది అమెజాన్ ప్రైమ్ వీడియో. ఈ మైలురాయి లాంటి ముఖ్యమైన ప్రకటనకు గుర్తుగా అమెజాన్ ప్రైమ్ వీడియో నేడిక్కడ ఒక ఆకర్షణీయమైన ట్రైలర్ ను విడుదల చేసింది. దేశమంతా ప్రశంసలు పొందిన శ్రీకాంత్ తివారీ పాత్రలో మనోన్ బాజ్ పేయీ నటించారు.
 
ఈ సీజన్లో శ్రీకాంత్ తివారీ ఒక కొత్త, శక్తివంతమైన, క్రూరమైన విరోధి రాజీతో తలపడుతాడు. రాజీ పాత్రలో సమంతా అక్కినేని నటించారు. తొమ్మిది భాగాలుగా ఉండే ఈ థ్రిల్లర్లో దేశాన్ని కాపాడే యత్నాల్లో భాగంగా శ్రీకాంత్ మధ్యతరగతి కుటుంబ జీవిగా, ప్రపంచస్థాయి గూఢచారిగా తన పోరాటాన్ని కొనసాగించనున్నాడు. ఉద్వేగభరిత ట్విస్టులతో ఊహించని క్లైమాక్స్‌తో ఈ రాబోయే సీజన్ శ్రీకాంత్‌కు చెందిన రెండు ప్రపంచాల్లోకి వీక్షకులను తీసుకెళ్తుంది.

ట్రైలర్ ను ఇక్కడ చూడగలరు.
 
ట్రైలర్ ఆవిష్కరణ సందర్భంగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా ఒరిజినల్స్ హెడ్ అపర్ణ పురోహిత్ మాట్లాడుతూ, ‘‘మా పాత్రల పేర్లు ప్రతి ఇంటా వినిపించడం కంటే మించింది మరొకటి మాకు ఉండదు. ఫ్యామిలీ మ్యాన్‌గా శ్రీకాంత్ తివారీ ఎంతగానో ఆదరణ పొందాడు. అందరితోనూ కనెక్ట్ కాగలిగాడు. అన్ని హద్దులనూ అధిగమించగలిగాడు. ది ఫ్యామిలీ మ్యాన్ నూతన సీజన్ మరింత రసవత్తరంగా ఉండనుంది.
 
శ్రీకాంత్, ఆయన విరోధి మధ్య జరిగే పోరాటం వీక్షకులకు మరింత థ్రిల్ అందిస్తుందని భావిస్తున్నాం. ప్రతి ఒక్కరికీ ఇది ఆహ్లాదాన్ని అందిస్తుంది. ఈ నూతన సీజన్ కోసం మనమిక ఎదురుచూసే స్థితిలో లేం’’ అని అన్నారు. రూపకర్తలైన రాజ్, డీకే ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘రూపకర్తలుగా మేం అంతా ఎంతగానో ఎదురుచూస్తున్న ది ఫ్యామిలీ మ్యాన్‌కు సంబంధించి ట్రైలర్‌ను మీతో పంచుకునేందుకు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నాం.
webdunia
ఈ వేసవి నాటికి ఈ సీజన్ పూర్తవుతుందని మేం వాగ్దానం చేశాం, మా మాటను మేం నిలబెట్టుకున్నాం. ఈ ఎదురుచూపులు జూన్ 4thతో ముగిసిపోనున్నాయి. థ్రిల్లింగ్ స్టోరీలైన్‌తో శ్రీకాంత్ తివారీ మీ ముందుకు రానున్నారు. ప్రమాదం సరికొత్త రూపంలో- సమంతా అక్కినేనిగా రానుంది. ఆమె ఎంతో చక్కగా ఆ పాత్రలో జీవించారు. ఈ మహమ్మారి సమయంలో పని చేయాల్సి వచ్చినప్పటికీ, మీ అందరికీ ఎంతో చక్కటి సీజన్ అందించగలమనే మేం విశ్వసిస్తున్నాం. మీ ఎదురుచూపులకు తగిన ప్రతిఫలాన్ని ఈ సీజన్ అందిస్తుందనే భావిస్తున్నాం. నిజంగా ఇదెంతో కష్టకాలం.
 
మంచి కాలం త్వరగా రావాలని కోరుకుంటున్నాం. సురక్షితంగా ఉండండి, మాస్క్ ధరించండి, సాధ్యమైనంత త్వరగా టీకా తీసుకోండి’’ అని అన్నారు. ఎంతగానో ప్రశంసలు పొందిన అమెజాన్ ఒరిజినల్ సిరీస్ సౌత్ సూపర్ స్టార్ సమంతా అక్కినేని డిజిటల్ రంగప్రవేశానికి వేదిక కానుంది. పద్మశ్రీ గ్రహీత మనోజ్ బాజ్‌పేయి, ప్రియమణితో సహా ప్రసిద్ధ తారాగణంషరీబ్ హష్మి, సీమా బిస్వాస్, దర్శన్ కుమార్, శరద్ కేల్కర్, సన్నీ హిందూజా, శ్రేయా ధన్వంతరి, షాహాబ్ అలీ, వేదాంత్ సిన్హా,మహేక్ ఠాకూర్ లతో కలసి ఆమె నటించనున్నారు. ఈ షోలో మైమ్ గోపి, రవీంద్ర విజయ్, దేవదర్శిని చేతన్, ఆనంద్ సమి, ఎన్. అలగంపెరుమల్లతో సహా తమిళ సినిమా రంగానికి చెందిన అద్భుత తారాగణం ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహేష్ బాబుకు కరోనా భయం... ఇంటి వద్ద భద్రత పెంపు!