Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహేష్ బాబుకు కరోనా భయం... ఇంటి వద్ద భద్రత పెంపు! (video)

మహేష్ బాబుకు కరోనా భయం... ఇంటి వద్ద భద్రత పెంపు! (video)
, బుధవారం, 19 మే 2021 (12:19 IST)
కరోనా లాక్డౌన్ కారణంగా సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులంతా తమతమ ఇళ్ళకే పరిమితమయ్యారు. తమతమ ఇళ్లుదాటి బయటకు వెళ్లడంలేదు. సినిమా షూటింగులు లేవు. కొత్త సినిమాల విడుదల అస్సలేలేవు. ఫ్యాన్స్ హడావుడిగా పూర్తికా కనుమరుగైంది. ఇలాంటి పరిస్థితుల్లో టాలీవుడ్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు ఇంటివద్ద మాత్రం భారీ సెక్యూరిటీ ఉంది. ఎలాంటి ఫంక్షన్లు లేనపుడు ఇంతటి భద్రత ఎందుకని ప్రతి ఒక్కరిలో సందేహం కలుగుతుంది. దీనిపై ఆరా తీయగా అస్సలు విషయం వెలుగులోకి వచ్చింది. 
 
టాలీవుడ్‌కు చెందిన మెగాస్టార్ చిరంజీవి మొదలు అల్లు అర్జున్, ఎన్టీఆర్ సహా చాలా మంది హీరో హీరోయిన్లు, జూనియర్ ఆర్టిస్టులు కరోనా బారిన పడ్డారు. షూటింగ్‌లు ముందే బంద్ చేస్తున్నారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ మహమ్మారి వారిని వదలడంలేదు.
 
ఈ నేపథ్యంలోనే మహేష్‌బాబు కూడా అప్రమత్తమయ్యారు. హైదరాబాద్‌లోని తన ఇంటి వద్ద సెక్యూరిటీ భారీగా పెంచారు. ఇంట్లో పనిచేసేవాళ్లు మినహా మిగిలినవారిని ఎవరినీ ఇంట్లోకి రానివ్వడంలేదు. పైగా ఇంట్లో పనిచేసేవారికి ప్రతి రోజు కరోనా టెస్టులు చేయిస్తున్నారట.
 
ఇప్పటికే మహేష్‌బాబు వ్యాక్సిన్ తొలిడోసు తీసుకున్నారు. త్వరలో సెకండ్ డోస్ తీసుకోనున్నారు. దీంతో సెండ్ డోస్ తీసుకునేవరకూ జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించారు. అందుకే షూటింగ్‌లు బంద్ చేసుకుని.. ఇంట్లో ఉండడమేకాదు.. బయటనుంచి వచ్చేవారి కారణంగా కరోనా మహమ్మారి రాకూడదనే ఉద్దేశంతో ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#HBDSudigaliSudheer సుడిగాలిలా వచ్చాడు... అలా నాటుకుపోయాడు..