Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఓటీటీ టొవినో థామ‌స్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘కాలా’

Advertiesment
ఓటీటీ టొవినో థామ‌స్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘కాలా’
, సోమవారం, 24 మే 2021 (19:36 IST)
kala
బ్లాస్ బ‌స్ట‌ర్ మూవీస్‌, ఒరిజిన‌ల్స్‌, వెబ్ షోస్‌తో ఈ వేసవిలో తెలుగు ఆడియెన్స్‌ ఇళ్ల‌ల్లోనికే హౌస్ ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోంది హండ్రెడ్ ప‌ర్సెంట్ తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’. ఈ క్ర‌మంలో జూన్ 4న టొవినో థామ‌స్ క‌థానాయ‌కుడిగా న‌టించిన మోస్ట్ అవెయిటెడ్ యాక్ష‌న్ డ్రామా ‘కాలా’ విడుద‌ల‌వుతుంది. ఈ ఏడాది ప్ర‌థ‌మార్థంలో విడుద‌లైన ఈ చిత్రంలో ప్రేక్ష‌కుల‌తో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను సైతం అందుకుంది. 
 
ఓ హింసాత్మ‌క ఘ‌ట‌న‌లో చనిపోయే కుక్క కార‌ణంగా ఇద్ద‌రి వ్య‌క్తుల మ‌ధ్య ఆస‌క్తిక‌ర‌మైన భావోద్వేగాల‌తో న‌డిచే క‌థే ‘కాలా’. రోహిత్ వి.ఎస్‌. ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. మంచి యాక్ష‌న్ స‌న్నివేశాలు, బ‌ల‌మైన భావోద్వేగాలు, పైసా వ‌సూల్ స్టంట్స్‌తో మంచి తారాగ‌ణం ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేస్తుంది. టొవినో థామ‌స్‌, సుమేష్ మూర్‌, దివ్యా పిళ్లై, లాల్ పాల్‌, ప్ర‌మోద్ వెల్లియానంద్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. 
 
ప‌లు బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను అందించిన ‘ఆహా’ బ్లాక్ బ‌స్ట‌ర్ లిస్టులో ‘కాలా’ చేర‌నుంది. ఇది వ‌ర‌కు మూతాన్‌, జ‌ల్లిక‌ట్టు, మిడ్‌నైట్ మ‌ర్డ‌ర్స్‌, వ్యూహం, నిఫా వైర‌స్‌, షైల‌క్ వంటి మ‌ల‌యాళ అనువాద చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించి అల‌రించిన ఆహా ఇప్పుడు అదే వైడ్ రేంజ్‌లో కాలా చిత్రాన్ని విడుద‌ల చేస్తుంది.  
 
త్వరలో ప్రియదర్శి ప్రధాన పాత్రధారిగా చేస్తోన్న ఒరిజినల్ ఇన్ ది నేమ్ ఆఫ్ ది గాడ్ ప్రసారం కానుంది.  క్రాక్‌, నాంది, గాలి సంప‌త్‌, జాంబిరెడ్డి, సుల్తాన్‌, చావు క‌బురు చ‌ల్ల‌గా చిత్రాల‌తో  ఈ ఏడాది  ప్రేక్ష‌కుల‌ను అల‌రించి ఆహా మ‌రింత నాణ్య‌మైన ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించ‌నుంది. ఈ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఎంజాయ్ చేయడంలో మీదే ఇక ఆల‌స్యం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాబు గోగినేనిపై మాధవీలత ఫైర్.. అయ్యగారి కథేంటో బిగ్ బాస్‌లో చూసేశాం.. మూతి మీద..?