Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్టార్‌ మా డ్యాన్స్‌ విజేతగా నిలిచిన సంకేత్‌ సహదేవ్‌

Advertiesment
Star Ma
, సోమవారం, 24 మే 2021 (13:01 IST)
Omkar, mumaith, sanket
ఓంకార్ ఆధ్వ‌ర్యంలో గత కొద్ది నెలలుగా స్టార్ మా లో అత్యంత ఆసక్తిగా జరుగుతున్న స్టార్‌ మా డ్యాన్స్‌+ పోటీల ఫైనల్స్‌ ఆదివారం రసవత్తరంగా జరిగాయి. ఒకరిని మించిన ప్రదర్శన మరొకరు చేస్తూ వీక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేశారు ఫైనలిస్ట్‌లు. ప్రతి వారం వినూత్న నేపథ్యాలతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న ఫైనలిస్ట్‌లు ఫైనల్స్‌లో తమదైన సృజనాత్మకత, వైవిధ్యతను చూపడానికి ప్రయత్నించి సఫలీకృతులయ్యారు. కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా వచ్చిన లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన ప్రతి ఒక్కరికీ వినోదాన్ని పంచుతూ స్టార్‌ మా డ్యాన్స్‌+ ఫైనల్స్‌ ఆదివారం రాత్రి జరిగాయి.
 
ఈ ఫైనల్స్‌లో వాసి టోనీ (యశ్వంత్‌ మాస్టర్‌ టీమ్‌), సంకేత్‌ సహదేవ్‌ (యశ్వంత్‌ మాస్టర్‌ టీమ్‌), మహేశ్వరి – తేజస్విని (బాబా మాస్టర్‌ బృందం), జియా ఠాకూర్‌ (అనీ మాస్టర్‌ బృందం), డార్జిలింగ్‌ డెవిల్స్‌ (రఘు మాస్టర్‌ బృందం) పోటీపడ్డారు. శాస్త్రీయ నృత్యానికి పాశ్చాత్య నృత్య రీతులను కూడా మిళితం చేసి మహేశ్వరి–తేజస్విని ఆకట్టుకుంటే, తమదైన వైవిధ్యతను చూపుతూ మిగిలిన పోటీదారులు ఆకట్టుకున్నారు. 
 
webdunia
Sanketh Sahadev
ఈ సీజన్‌ విజేతగా సంకేత్‌ సహదేవ్‌ నిలువడంతో పాటుగా 20 లక్షల రూపాయల బహుమతినీ గెలుచుకున్నారు.  గత 21 వారాలుగా స్టార్‌ మాలో ప్రసారమవుతున్న డ్యాన్స్‌ + షో హోస్ట్‌, దర్శకునిగా ఓంకార్‌ వ్యవహరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సోనూసూద్ బాటలో అలీ.. 130 మంది మహిళలకు నిత్యావసర సరుకులు