Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెంటల్‌ యాంగ్జైటీతో కరోనా మరణాలు : భాగ్యశ్రీ

Webdunia
గురువారం, 27 మే 2021 (10:49 IST)
దేశంలో కరోనా వైరస్ రోగుల మృతులపై బాలీవుడ్ నటి భాగ్యశ్రీ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. చాలా మంది కరోనా భయం, మెంటల్ యాంగ్జైటీతో ప్రాణాలు కోల్పోతున్నారని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా, కరోనా రోగులు త్వరగా కోలుకోవాలంటే ధైర్యమే సగం బలం అని ఆమె వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు. 
 
ఇందులో ఆమె ఏం మాట్లాడారంటే.. 'కరోనా సెకెండ్‌ వేవ్‌ ఉధృతి పెరగడంతో ప్రజల పరిస్థితి మరింత కష్టంగా మారింది. తెలియని దానికోసం భయపడడం, టెన్షన్‌ తెచ్చుకోవడం వల్ల లోలోపలే మనం నలిగిపోతున్నాం. అదే మరణానికి దారి తీస్తుంది. నా తండ్రికి కరోనా సోకిన సమయంలో భయపడుతూ ఏం జరిగిపోతుందో అన్న యాంగ్జైటీ సమస్యతో ఐసీయూలో చేరారు. 
 
22 రోజుల తర్వాత మరణించారు. నాతో ఉండే కజిన్స్‌ కూడా ఇలాంటి సమస్యతోనే భయపడేవారు. వారందరికీ పాజిటివ్‌గా ఉండమని చెప్పా. మనం ఆరోగ్యంగా, భయం లేకుండా ఉండాలంటే కరోనాకు సంబంధించిన న్యూస్‌ చూడడం మానేయాలి. 
 
ఖాళీ సమయంలో కుటుంబ సభ్యులతో గడపండి. ఐసోలేషన్‌లో ఉన్న వాళ్లు సన్నిహితులతో వీడియో కాల్‌లో కనెక్ట్‌ అవ్వండి. హెల్తీఫుడ్‌ తీసుకోండి. వ్యాయామాలు చేయండి. ప్రశాంతంగా పడుకోండి. దాని వల్ల మనలో ఇమ్యూనిటీ స్టాండ్‌ పెరుగుతుంది. యాంగ్జైటీ డిసీజ్‌ ఉన్నవాళ్లు డాక్టర్‌ని కలవండి. మెంటల్‌ హెల్త్‌ కేర్‌ వర్కర్స్‌ సజెషన్స్‌ తీసుకోండి'  అంటూ ఆమె హితవు పలికారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహా పీఠముడి... మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?

డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట.. ఏంటది..?

అరెస్టుకు సిద్ధంగా పోలీసులు.. పారిపోయిన రాంగోపాల్ వర్మ!!

బంగాళాఖాతంలో అల్పపీడనం : ఏపీతో సహా ఆ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments