తాను మరోసారి అందరికీ గుర్తుచేస్తున్నానంటూ మహేష్‌బాబు తన సోషల్‌మీడియాలో కొన్ని విషయాలు తెలియజేశారు. కరోనా వల్ల ఇంతకుముందు చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. మరోసారి తప్పని పరిస్థితుల్లో మనమంతా జాగ్రత్తగా వుండాలి. `ఇంటిలోనే సేఫ్‌గా వుండండి` అంటూ కాప్షన్‌తో ఆయన తను మాస్క్‌ను ధరించి చూపించారు.
అసాధారణమైన సమయాలకు అదనపు సాధారణ చర్యలు అవసరం. మాస్క్‌ను ధరించండి, శానిటైజర్ వాడండి. ఇంట్లో ఉండండి, సురక్షితంగా ఉండండి, మీ వంతు వచ్చినప్పుడు టీకాలు వేసుకోండి. ఇంతకుముందు ఎంత ఉత్సాహంగా ఉన్నమో అలానే వుందామంటూ ఆయన పేర్కొన్నారు. ఇటీవలే తన సినిమా షూటింగ్‌కు వాయిదా వేసుకుని ఇంటివద్దనే ఆయన వున్నారు.