Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బీఏ రాజు మరణం షాక్‌కి గురి చేసిందిః సినీప్ర‌ముఖులు

Advertiesment
బీఏ రాజు మరణం షాక్‌కి గురి చేసిందిః సినీప్ర‌ముఖులు
, శనివారం, 22 మే 2021 (16:24 IST)
Raju family, krishna family
ప్రముఖ జర్నలిస్ట్, సూపర్‌హిట్ పత్రికాధినేత, అగ్ర పీఆర్వో, నిర్మాత బీఏ రాజు ఆకస్మిక మరణం షాక్‌కు గురిచేసింద‌ని హీరోలు, నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు పేర్కొన్నారు. మెగాస్టార్ చిరంజీవి, నాగ‌బాబు, ప్ర‌భాస్‌, నాగార్జున‌, మ‌హేస్‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్, ప్ర‌కాష్‌రాజ్, రాజుగారు లేర‌నే మాట ఇంకా మింగుడుప‌డ‌డం లేద‌నీ, వారి కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నామ‌ని పేర్కొన్నారు. రాజుగారి భార్య జ‌య‌గారు మ‌ర‌ణించిన‌ప్పుడు ఆయ‌న చిన్న‌పిల్లాడిలా మారిపోయి నాగుండెను హ‌త్తుకుని బాధ‌ప‌డ‌డం ఇప్ప‌టికీ మ‌ర్చిపోలేన‌ని చిరంజీవి అన్నారు. గీత‌ర‌చ‌యిత భాస్క‌ర‌భ‌ట్ల, జ‌య‌గారి మ‌రణించినప్పుడు ఓదార్చ‌డానికి వెళితే `నేనే మ‌ర‌ణించాను. జ‌య నా రూపంలో బ‌తికేవుందంటూ` అన‌డం మ‌ర్చిపోలేని పేర్కొన్నారు. ఇక నిర్మాత‌ల‌మండ‌లి, ఫిలింఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్‌, `మా` అసోసియేష‌న్ సంతాపాన్ని వ్య‌క్తం చేశారు.
 
రాజశేఖర్, జీవిత దంపతులుః మేం నటించిన చాలా చిత్రాలకు ఆయన పీఆర్వో చేశారు. మాకు పర్సనల్ పీఆర్వోగానూ పని చేశారు. కొన్నేళ్లు రాజశేఖర్ గారి డేట్లు చూశారు. తరచూ మేం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇప్పటికీ మా కొత్త సినిమాలు వస్తే ఫోన్స్ చేసి మాట్లాడతారు. ప్రచార కార్యక్రమాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించేవారు. మా పిల్లల సినిమాలపై కూడా అదే శ్రద్ధ చూపించారు. 
 
ద‌ర్శ‌కుడు వీర‌భ్ర‌దంః  సుదీర్ఘ నా సినీ ప్రయాణంలో ఎప్పుడూ నన్ను ప్రోత్సహిస్తూ, మంచి మనసుతో పలకరిస్తూ, ఆప్యాయత, అనురాగలను నాపై చూపిస్తూ, నా సినిమాలకు మంచి ప్రజాధరణ కలిపించిన మంచి మనిషి, మా బి ఏ రాజు ఇక లేరు అనే వార్తను జీర్ణించుకోలేకపోతున్న, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను.
 
webdunia
BA Raju body
బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ (నిర్మాత‌)  1984లో స‌రిగ్గా ఇలాంటి రోజుల్లో నేను సూప‌ర్ స్టార్‌ కృష్ణ‌గారితో సినిమా చేయాల‌నుకున్నాను. అదే సంద‌ర్భంలో .. మే 31న కృష్ణ‌గారి పుట్టిన‌రోజు.. కాబ‌ట్టి కృష్ణ‌గారి స్టిల్స్ కావాల‌ని అనుకున్న‌ప్పుడు దివంగ‌త సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ప‌సుపులేటి రామారావుగారు న‌న్ను బి.ఎ.రాజుకి ప‌రిచ‌యం చేశారు. మృదు స్వ‌భావి. ఎవ‌రినీ నొప్పించ‌కుండా, చిరునువ్వుతో అంద‌రినీ ప‌ల‌క‌రించే మ‌న‌స్త‌త్వం ఆయ‌న‌కు న‌న్ను మ‌రింత ద‌గ్గ‌ర చేసింది. అప్ప‌టి నుంచి మూడున్న‌ర దశాబ్దాల‌కు పైగా బి.ఎ.రాజుతో అనుబంధం కొన‌సాగింది. నేను నిర్మాత‌గా చేసిన ఎన్నో సినిమాల‌కు ఆయ‌న పి.ఆర్‌.ఓ వ‌ర్క్ చేశారు. మనలో ఒకడిగా కలిసిపోయే మంచి గుణమున్న వ్యక్తి. అలాంటి బి.ఎ.రాజు ఉన్న‌ట్లుండి హ‌ఠాన్మ‌ర‌ణం చెందార‌ని తెలిసి షాక‌య్యాను.
 
దర్శకుడు ప్రవీణ్ సత్తారుః "సినిమా దర్శకులకు దర్శకరత్న దాసరి నారాయణరావుగారు ఎలాగో, ఫిల్మ్ జర్నలిస్టులకు బీఏ రాజు అలాగ. ఇద్దరూ మార్గదర్శకులుగా నిలిచిన వ్యక్తులు. పెద్దదిక్కుగా నిలిచినవాళ్లు" అని దర్శకుడు ప్రవీణ్ సత్తారు అన్నారు. ప్రముఖ నిర్మాత, సూపర్‌హిట్ పత్రికాధినేత, పీఆర్వో, జర్నలిస్ట్ బీఏ రాజు ఆకస్మిక మృతిపై ప్రవీణ్ సత్తారు సంతాపం వ్యక్తం చేశారు. 
 
 నిర్మాత చందన్ రెడ్డి ః జర్నలిస్ట్, సూపర్‌హిట్ పత్రికాధినేత, పీఆర్వో, నిర్మాత బీఏ రాజు మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని కామాక్షి మూవీస్ అధినేత డి. శివప్రసాద్ రెడ్డి తనయుడు, నిర్మాత చందన్ రెడ్డి అన్నారు. బీఏ రాజు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
 
ఆర్ నారాయణ మూర్తిః 1980వ దశకం లో మద్రాస్ లో నాకు బి ఏ రాజు గారు పరిచయం. హిరో కృష్ణ గారికి వీరాభిమానిగా, పాత్రికేయుడిగా, సిని పబ్లిసిటీ ఇంఛార్జిగా, సూపర్ హిట్ వార పత్రిక అధినేతగా, అన్నింటికీ మించి సిని పరిశ్రమ తలలోని నాలుక లా అందరి అప్తుడుగా, సిని నిర్మాతగా అయన చేసిన సేవలు అమోఘం. బి ఏ రాజు గారి మరణం సిని పరిశ్రమ కు ముఖ్యంగా పాత్రికేయ రంగానికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అన్న‌మ‌య్యకు 24 ఏళ్లు, మళ్లీ అలాంటి సినిమా తీయ‌లేం: దర్శకేంద్రుడు