Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి నేడు.. 30 రోజులు లీవు.. ఎవరికి?

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి నేడు.. 30 రోజులు లీవు.. ఎవరికి?
, శుక్రవారం, 21 మే 2021 (12:00 IST)
దేశ మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి నేడు. గొప్ప రాజ‌కీయ వార‌స‌త్వ నేప‌థ్యం మ‌రియు దిగ్గ‌జ‌ నేత‌లతో కూడిన ఉన్న‌త కుటుంబంలో జ‌న్మించిన‌ రాజీవ్ గాంధీ దేశాన్ని కొత్త దిశ‌గా న‌డిపించారు. 1984లో త‌న త‌ల్లి ఇందిరా గాంధీ మ‌ర‌ణానంత‌రం ఆయ‌న దేశానికి 6వ ప్ర‌ధానిగా సేవ‌లందించారు. బాల్యంలో త‌న తాత జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రు ప్ర‌ధానిగా ఉన్న స‌మ‌యంలోనే దేశానికి నాయ‌క‌త్వం వ‌హించడంలో గ‌ల ల‌క్ష‌ణాల‌ను ఆయ‌న అవ‌పోస‌న ప‌ట్టారు. 
 
అయితే త‌న కుటుంబ నేప‌థ్యానికి భిన్నంగా ఆయ‌న వేరే వృత్తిని ఎంచుకున్నారు. 40 సంవత్సరాల వయసులో ప్రధాన మంత్రి అయిన రాజీవ్ గాంధీ, భారత ప్రధానుల‌లో అతి పిన్న వయస్కుడు. రాజీవ్ కు ఆ పేరును ఆయ‌న‌ అమ్మ‌మ్మ పెట్టారు. ఫొటోగ్ర‌ఫీ అంటే ఆయ‌న‌కు ఆస‌క్తి ఎక్కువ‌. 
 
కాగా.. రాజీవ్ గాంధీ వర్థంతి సందర్భంగా దేశంలో కరోనా బాధితుల కోసం సహాయం అందించాలని ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ అధ్వర్యంలో జరిగిన జూమ్ సమావేశంలో కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలో, దేశంలోని నలు మూలల్లో ఉన్న కాంగ్రెస్ రాష్ట్ర, జిల్లా, మండల కార్యాలయాలను కరోనా వైరస్ బాధితుల కోసం అక్కడి ప్రభుత్వానికి కొన్ని నెలల కోసం ఇవ్వాలనే ప్రతిపాదన చేయాలని నాయకులు నిర్ణయించినట్టు తెలుస్తోంది. రెండవ దశ తీవ్ర పరిణామాలు చూపిస్తున్న తరుణంలో బాదితులకు అండగా ఉంగాలనే ప్రతిపాదన ప్రధానంగా వినిపించినట్టు తెలుస్తోంది.
 
ఇదిలా ఉంటే.. మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న దోషి ఎ.జి.పెరారివలన్‌కు తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్ 30 రోజుల లీవు మంజూరు చేశారు. పెరారివలన్ తల్లి అర్పుతమ్మాల్ చేసిన అభ్యర్థనపై ఆయన ఈ సెలవుకు అంగీకారం తెలిపారు. ఈ సెకండ్ కోవిద్ వేవ్ తరుణంలో తన కొడుకు ఆరోగ్యం సరిగా ఉండడంలేదని ఆమె తన వినతిపత్రంలో పేర్కొన్నారు. తన కుమారుని ఆరోగ్యం హైరిస్క్ లో ఉందని జైల్లోని డాక్టర్ ఒకరు చెప్పారని, అతనికి ఈ సమయంలో చికిత్స ఎంతయినా అవసరమని ఆమె అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనాపై కేంద్రప్రభుత్వ కొత్త మార్గదర్శకాలు ఇవే