Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఘోరాల కోసం రూ. 1 కోటీ 30 లక్షలు ఖర్చు చేసిన లారెన్స్.... ఎందుకు?

Webdunia
సోమవారం, 15 ఏప్రియల్ 2019 (15:39 IST)
ముని, కాంచ‌న‌, కాంచ‌న‌-2 తో హార్ర‌ర్ కామెడీ చిత్రాల్లో సౌత్ ఇండియాలోనే భారీ స‌క్స‌ెస్‌తో పాటు ఒక ట్రెండ్ సృష్టించిన రాఘ‌వ లారెన్స్ హీరోగా, స్వీయ ద‌ర్శ‌కత్వంలో ముని సిరీస్ నుంచి వ‌స్తున్న హార్ర‌ర్ కామెడీ చిత్రం కాంచ‌న‌-3. రాఘ‌వ లారెన్స్ అందించిన హార్ర‌ర్ చిత్రాల‌న్నీ సౌత్ ఇండియాలో బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌గా బాక్సాఫీస్‌ని షేక్ చేసిన‌వే. అన్నిటినీ మించి ఈ కాంచ‌న‌-3 మాత్రం లారెన్స్‌కి స్పెష‌ల్ చిత్రంగా నిలవనుంది. 
 
ఈ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ నిర్మాత బి. మ‌ధు విడుదల చేస్తున్నారు. రాఘ‌వేంద్ర ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్లో రాఘ‌వ నిర్మాణంలో ఈ సినిమా నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో ఏప్రిల్ 19న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుద‌ల చేయనున్నారు. ప్రతీ చిత్రంలో లాఘవ లారెన్స్ ఎన్నో థ్రిల్స్ అందిస్తూ వస్తున్నారు . ఈసారి కూడా కాంచన 3 తో చాలా థ్రిల్స్ ఉండబోతున్నాయి . దాదాపు 1400 మంది డాన్సర్స్‌తో కోటి ముప్పై లక్షలు ఖర్చుపెట్టి ఓ పాటను చిత్రీకరించడం విశేషం.
 
దాదాపు 1400 మంది డాన్సర్స్‌తో మాస్టర్ అత్యద్భుతంగా సాంగ్‌ని షూట్ చేశారు. 400 మంది అఘోరా గెటప్స్‌తో… 1000 మంది డిఫ్రెంట్ లుక్‌తో 6 రోజుల పాటు సాంగ్ చిత్రీకరణ చేశారు. లారెన్స్‌కి కాంచన 3 చిత్రం తన కెరీర్ కే ప్రత్యేకమైంది. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు . కథ, కథనం, గ్రాఫిక్స్ ప్రేక్షకుల్ని అబ్బురపరిచేలా ఉంటాయి. గతంలో వచ్చిన చిత్రాల కంటే బలమైన కథ, కథనంతో రూపొందించారు. అలాగే మంచి సర్‌ప్రైజ్ ఎలిమెంట్స్‌తో థ్రిల్ చేయనున్నారు. ఇప్పటివరకు సిల్వర్ స్క్రీన్ మీద చూడని గొప్ప నటన  ఈ నెల 19 న తెలుగు, తమిళ భాషల్లో చూస్తారు అని చిత్ర నిర్మాత మ‌ధు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

నెలమంగళం టోల్‌ప్లాజాలో అరాచకం... (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments