నా అందం రేటు ఎంతో తెలుసా..? తమన్నా

శనివారం, 13 ఏప్రియల్ 2019 (17:45 IST)
చేతిలో సినిమాలు తగ్గడంతో తమన్నా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయినట్లుంది. ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ వార్తల్లోకెక్కుతోంది. తెలుగు, తమిళంలోనే కాకుండా హిందీలోనే తన టాలెంట్ నిరూపించుకోవాలనుకుంది. కానీ పెద్దగా హిందీ భాషలో తమన్నా సినిమాలు ప్రదర్శించలేదు. దీంతో తమన్నా ప్రస్తుతం ఖాళీగానే ఉంది.
 
తాజాగా తమన్నా ట్విట్టర్ వేదికగా చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారుతోంది. నేను టాప్ హీరోయిన్‌నే. పదిమంది హీరోయిన్లలో ఒకరినే. అయితే ఎప్పుడూ హీరోలతో సమానంగా హీరోయిన్లకు క్యారెక్టర్‌లు ఉండాలని నేను అనుకోను. నేను నటించే సినిమాలో హీరో కన్నా నాకే ఎక్కువ పేరు రావాలని ఎప్పుడూ భావించను.
 
నాకు కథలోని నా క్యారెక్టర్ కన్నా నాకిచ్చే డబ్బే ముఖ్యం. హీరోయిన్ ఎంత అందంగా ఉంటుందో అంత డబ్బులు నిర్మాతలు ఇస్తారు. దర్శకులు మమ్మల్ని ఎలా కావాలో అలా వాడుకుంటారు. నా అందం రేటు గురించి నేనెప్పుడు చెప్పను. మిల్కీ బ్యూటీగా సినీ పరిశ్రమలో నాకో రేటు ఉంది. దానికి తక్కువ ఇస్తే నేను ఏ సినిమాలు చేయను. నా రేటుకు ఎక్కువగా ఇస్తే సంతోషపడతానంటోంది తమన్నా.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ట్రిపుల్ ఆర్‌ కోసం ప్రభాస్ ఏం చేస్తున్నాడో తెలుసా?