టీడీపీ ఎలక్షన్ యాడ్‌ల రూపకర్త బోయపాటి.. భారీ మొత్తంలో రెమ్యునరేషన్?

బుధవారం, 10 ఏప్రియల్ 2019 (14:52 IST)
ఎలక్షన్ కొందరికి కాసుల వర్షాన్ని కురిపిస్తుంది. ఇలా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. సాధ్యమైనంత వరకు దండుకుంటారు. ఎలక్షన్‌లలో ప్రచారం చేసే స్టార్లు, యాడ్స్ డైరెక్టర్‌లు, మ్యూజిక్ డైరెక్టర్‌లు తలా కాస్త సంపాదించుకున్నారు. తెలుగుదేశం, వైకాపాలు భారీ బడ్జెట్‌తో ప్రచారం కోసం ప్రకటనలు రూపొందించారు. తప్పక గెలవాలనే తపనతో హామీలు, పథకాలు ఎలివేట్ చేస్తూ ప్రకటనలు విడుదల చేశారు. 
 
అయితే తెలుగు దేశం పార్టీ ప్రకటనలు సంథింగ్ స్పెషల్ అని ప్రజలు అంటున్నారు. తెలుగు దేశం ప్రకటనల్లో మోనోటనీ కామెడీకి ఆజ్యం పోసింది బోయపాటి. టీవీల్లో ఈ ప్రకటనలు చూసి చాలా మంది నవ్వుకున్నారు. రకరకాల వెర్షన్‌లతో అందరినీ అలరించాయి. వీటికోసం బోయపాటి భారీగానే పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది. ఏకంగా రూ.4.5 కోట్లకు డీల్ కుదిరిందని అంటున్నారు. 
 
అయితే ఈ ప్రకటనల రూపకల్పన కోసం బోయపాటి కొన్ని నెలలుగా శ్రమించారు. ఎన్నికల తర్వాత బోయపాటి సీన్ ఏంటి అనే ప్రశ్న మెదులుతోంది. దీనికి కూడా ఆయన సమాధానం సిద్ధం చేసుకున్నారు. తెదేపా నాయకుడు నందమూరి బాలకృష్ణ హీరోగా ఓ భారీ మాస్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు బోయపాటి రెడీ అవుతున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే చాలావరకు స్క్రిప్ట్ తయారు చేసారు. ప్రీప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు ఎన్నికల తర్వాత వెల్లడిస్తారట. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం అపోలో ఆస్పత్రి నేపథ్యమే ఇతివృత్తంగా 'శశిలలిత'