Webdunia - Bharat's app for daily news and videos

Install App

వదినమ్మ అలా అక్క అయ్యింది.. కార్తీకి అక్కగా జ్యోతిక..

Webdunia
సోమవారం, 15 ఏప్రియల్ 2019 (14:39 IST)
దక్షిణాది చిత్రాలలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న జ్యోతిక మంచి ఫామ్‌లో ఉన్నప్పుడే హీరో సూర్యను పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలలో నటించడానికి ఆసక్తి చూపలేదు. కుటుంబం, పిల్లలు దియా, దేవ్‌లను పెంచడంతో కాలం గడిపింది. పిల్లలు కాస్త పెద్దవాళ్లైన నేపథ్యంలో సూర్య సహాయంతో మళ్లీ సినిమాలలోకి రీఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కూడా మంచి హిట్‌లు అందుకుంది. 
 
తాజాగా సూర్య తమ్ముడు కార్తీ నటించబోయే చిత్రంలో జ్యోతిక పాత్ర కూడా ఉండబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ పాత్ర ఏమిటని సినీ వర్గాలలో ఆసక్తి నెలకొంది. కార్తీ, జ్యోతికలు వదినా మరిదిలు అవుతారు. అలాంటి వారు సినిమాలో ఏఏ పాత్రలు పోషించబోతున్నారనే ఉత్కంఠ నెలకొంది. జీతు జోసెఫ్ దర్శకత్వంలో ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం రూపొందబోతుంది. 
 
ఆ సినిమాలో అక్క పాత్ర చాలా కీలకం. హీరోగా కార్తీ నటించబోయే ఈ సినిమాలో అతనికి అక్క పాత్రలో జ్యోతికను ఉంచితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తమయింది. పాత్ర జ్యోతికకు కూడా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేసిందంట. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఈ సినిమానికి సంబంధించిన మరిన్ని విషయాలు చిత్ర యూనిట్ తర్వాత వెల్లడించనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

దేశంలో తొలి కోవిడ్ మరణం : కర్నాటకలో పెరుగుతున్న కేసులు

భారీ వర్షాలకు ఢిల్లీ అస్తవ్యస్తం - ఠాణా పైకప్పు కూలి ఎస్ఐ మృతి

ప్రియుడితో వెళ్లిపోయిన కుమార్తె .. కుటుంబం మొత్తం ఆత్మహత్య..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments