మహానటిని వద్దన్న రజనీకాంత్.. నయనతారతో సై..

ఆదివారం, 14 ఏప్రియల్ 2019 (11:14 IST)
సూపర్ స్టార్ రజనీకాంత్, మురుగదాస్ కాంబినేషన్‌లో 'దర్బార్' చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తుండగా, ముంబైలో షూటింగ్ కూడా మొదలైపోయింది.  ''మహానటి''గా నటించిన కీర్తి సురేష్ ఈ సినిమాలో దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్‌తో రొమాన్స్ చేయనుందని టాక్ వచ్చింది. 
 
అయితే కీర్తి సురేష్ తన సరసన సెట్ కాదని రజనీకాంత్ భావించినట్లు టాక్ వస్తోంది. తన పక్కన హీరోయిన్‌గా యువనటి కీర్తి సురేష్ బాగుండదని అభిప్రాయపడ్డ సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్, ఆ స్థానంలో నయనతారను తీసుకోవాలని కోరడంతో దర్శకుడు మురుగదాస్ నయనను ఎంపిక చేసినట్లు సమాచారం. 
 
గతంలో రజనీకాంత్‌తో రెండు సినిమాల్లో నటించిన నయనతార, ఇప్పుడు ముచ్చటగా మూడో చిత్రంతో జతకట్టే అవకాశాన్ని దక్కించుకుంది. కోలీవుడ్‌లో మంచి చాన్స్ కోల్పోయిన కీర్తి, టాలీవుడ్‌లో మాత్రం మెగా అవకాశాన్ని కొట్టేసింది. కీర్తి, త్వరలో చిరంజీవికి జోడీగా నటించనున్నట్టు ప్రచారం జరుగుతోంది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం పవర్ స్టార్‌తో గొడవ నిజమే.. రేణూ దేశాయ్ అడిగిన ప్రశ్నకు అలీ