సోగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి సీక్వెల్‌గా ''బంగార్రాజు'' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. జూలైలో సెట్స్‌పైకి తీసుకెళతారని తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్-మనం ఎంటర్ ప్రైజెస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి.
కింగ్ నాగార్జున కథానాయకుడుగా నటిస్తున్న ''బంగార్రాజు'' చిత్రంలో అఖిల్ ఓ ఆసక్తికర పాత్రలో నటించనున్నాడని టాక్ వస్తోంది. ఇందులో భాగంగా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఆ పాత్రను ఆసక్తికరంగా డిజైన్ చేశాడని తెలుస్తోంది. అలాగే సమంత, నాగచైతన్య కూడా ఇందులో గెస్ట్ రోల్ ప్లే చేస్తారని టాక్ వస్తోంది.
ఇప్పటికే నాగార్జున ''మన్మథుడు 2'' సినిమాకి సంబంధించిన షూటింగ్ పనుల్లో బిజీగా వున్నారు. ఈ సినిమా చేస్తూనే మరోవైపున బంగార్రాజు ప్రాజెక్టును పట్టాలెక్కించే పనిలో వున్నారు. సోగ్గాడే చిన్నినాయనా చేసిన కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలోనే నాగార్జున బంగార్రాజు చేయనున్నారు. ఈ నెల చివరిలో గానీ.. వచ్చేనెల మొదట్లో గాని అయన ఈ సినిమాను లాంచ్ చేసే ఆలోచనలో వున్నారు.
ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం నయనతారను సంప్రదించారట. అయితే డేట్స్‌లేని కారణంగా ఈ సినిమా తాను చేయలేనని నయనతార చెప్పినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం నయనతార తెలుగులో చిరంజీవి సరసన 'సైరా' చేస్తోంది. అలాగే తమిళంలోను ఒక సినిమా చేస్తోంది. ఇక తాజాగా రజనీ సరసన 'దర్బార్'కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందుచేత డేట్స్ అడ్జెస్ట్ చేయలేక నాగ్‌తో సినిమా చేసేందుకు నో చెప్పిందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో సమాచారం.