బంగార్రాజులో హీరోయిన్‌ని మార్చేస్తున్నారా..?

శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (21:29 IST)
అక్కినేని నాగార్జున కెరీర్లో ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేని చిత్రం సోగ్గాడే చిన్ని నాయ‌నా. క‌ళ్యాణ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం నాగార్జున కెరీర్లో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేసిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా ఇచ్చిన విజ‌యంతో సీక్వెల్ తీయాల‌ని నాగార్జున ఎప్ప‌టి నుంచో ప్లాన్ చేస్తున్నారు. ఇప్ప‌టికీ అంతా సెట్ అయ్యింది. అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ పైన నాగార్జున ఈ సినిమాలో న‌టించ‌నున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ చాలా ఫాస్ట్‌గా జ‌రుగుతోంది.
 
అస‌లు విష‌యానికి వ‌స్తే... ఈ సినిమాలో నాగార్జున బంగార్రాజు పాత్ర పోషిస్తున్నారు. అందుచేత బంగార్రాజు స‌ర‌స‌న ర‌మ్య‌కృష్ణ న‌టించనుందని వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. ఇప్పుడు కొత్త వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏంటంటే... ఈ సినిమా కోసం న‌య‌న‌తార‌ను సంప్ర‌దించార‌ట‌. ఇటీవ‌ల క‌ళ్యాణ్ కృష్ణ న‌య‌న‌తార‌కు క‌థ చెప్పార‌ట‌. ఆమె పాజిటివ్‌గా స్పందించార‌ని స‌మాచారం. ర‌మ్య‌కృష్ణ ఉండ‌గా మ‌రో క‌థానాయిక‌గా తీసుకుంటున్నారా..? లేక న‌య‌న‌తారను ప్ర‌త్యేక పాత్ర కోసం సంప్ర‌దించారా..? అనేది తెలియాల్సి వుంది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం 'తలైవా 166' పోస్టర్ లీక్.. సోషల్ మీడియాలో వైరల్