Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మ‌జిలీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ గెస్ట్‌లు ఎవ‌రో తెలుసా..?

Advertiesment
మ‌జిలీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ గెస్ట్‌లు ఎవ‌రో తెలుసా..?
, శనివారం, 30 మార్చి 2019 (17:25 IST)
అక్కినేని నాగ చైత‌న్య - స‌మంత జంట‌గా న‌టించిన లేటెస్ట్ మూవీ మ‌జిలీ. నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్ పైన సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల రిలీజ్ చేసిన మ‌జిలీ సాంగ్స్‌కు ట్రెమండ‌స్ రెస్సాన్స్ రావ‌డంతో.. ఈ సినిమాపై మ‌రిన్ని అంచ‌నాలు పెరిగాయి. ఎమోష‌న‌ల్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమాలో చైత‌న్య క్రికెట‌ర్‌గా న‌టించారు. 
 
ఈ నెల 31న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీ స్ధాయిలో నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... ఈ ఈవెంట్‌కు యువ స‌మ్రాట్ నాగార్జున - విక్ట‌రీ వెంక‌టేష్ ముఖ్య అతిథులుగా హాజ‌రు కానున్నారు. హైద‌రాబాద్ జెఆర్సీ ఫంక్ష‌న్ హాల్‌లో ఈ వేడుక జ‌ర‌ుగ‌నుంది. గోపీ సుంద‌ర్ సంగీతం అందించారు. త‌మ‌న్ రీ-రికార్డింగ్ అందించారు. ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. చైత‌న్య ఎప్ప‌టి నుంచో భారీ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. మ‌రి... ఆ భారీ విజ‌యాన్ని మ‌జిలీ అందిస్తుందేమో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా కెరీర్లో బెస్ట్ కాంప్లిమెంట్ ఇదే - వ‌ర్మ‌..!