సినీ రంగంలో స్టైల్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు... సూపర్ స్టార్ రజనీకాంత్.... ఆయన స్టైల్‌కి ఫ్యాన్స్ కాని వారు ఎవరూ ఉండరు ఉంటే అతిశయోక్తి కాదేమో... వయస్సు 70కి చేరుకుంటున్నప్పటికీ ఆయనలోని ఆ దూకుడు అభిమానుల్ని ఆకట్టుకుంటూనే ఉంది.
ఆయన తాజా సినిమాలలో రజనీ-శంకర్‌ల కాంబినేషన్ మూవీ 2.0 బాక్సాఫీస్ వద్ద 600 కోట్ల గ్రాస్ వసూలు చేయగా... మొన్న సంక్రాంతికి రిలీజైన `పేట` (పెట్టా) తమిళంలో పెద్ద హిట్ సాధించింది. ఈ విజయాలు అందించిన ఊపుతో ఇప్పుడు రజినీ నటించబోతున్న 167వ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే ఏర్పడ్డాయి.
అందులోనూ జాతీయ అవార్డ్ డైరెక్టర్ ఏ.ఆర్.మురుగదాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండడంతో ఎలాంటి సంచలనాలకు తెర తీస్తారోనన్న అంచనా అభిమానుల్ని నిలవనీయడం లేదు. ఇక రజనీ ఈసారి పోలీసాఫీసర్‌గానూ.. సోషల్ యాక్టివిస్టుగానూ ద్విపాత్రాభినయం చేయనున్నారని తెలుస్తోంది.
మురుగదాస్ ఇప్పటికే స్క్రిప్టు పూర్తిగా రెడీ చేసేయగా... ప్రీప్రొడక్షన్ పనులు పూర్తవుతున్నాయట. ఏప్రిల్ 10న అధికారికంగా లాంఛింగ్ ఉంటుందని తెలుస్తోంది. తాజాగా చెన్నైలోని ఓ పాపులర్ స్టూడియోస్‌లో రజనీపై ఫోటోషూట్ చేసారని తెలుస్తోంది.
కాగా... ఈ ఫోటో షూట్ నుండి ఎవరో ఓ ఫోటోని లీక్ చేయడంతో అది కాస్తా ఇంటర్నెట్‌లో జోరుగా వైరల్ అవుతోంది. ఈ పోస్టర్ పై 166 అనే టైటిల్ కనిపిస్తోంది. రజనీ స్టైల్‌గా సిగరెట్ కాలుస్తూ గుబురు గడ్డం కోర మీసాలతో కోపోద్రిక్తుడిగా కనిపిస్తున్నారు.
బాషా స్టైల్లో హెయిర్‌లో కొత్తదనం చూపించే ప్రయత్నం చేస్తూండగా... ఆయన కళ్లకు రేబాన్ కళ్లద్దాలు అతడి స్థాయిని గ్లామర్‌ని మరింత పెంచేసింది. ఈ ఒక్క పోస్టర్‌తోనే సినిమాపై అంచనాలు భారీగా పెంచేస్తూ... అభిమానుల్లో కల్లోలం సృష్టిస్తోందంటే మరి ముందు ముందు ఎలా ఉంటుందో!! కాకాపోతే ఇది రజినీ కెరీర్‌లో 167వ సినిమా అయితే 166 అని టైటిల్ వేశారేంటో మరి?