Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

త్రివిక్రమ్‌కు, నాకు మాధ్య జరిగింది ఇది.. అంతా వెధవలు.. నటి హేమ

Advertiesment
త్రివిక్రమ్‌కు, నాకు మాధ్య జరిగింది ఇది.. అంతా వెధవలు.. నటి హేమ
, శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (11:05 IST)
టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి క్రేజ్ ఉన్న నటి హేమ. కేవలం నటిగానే కాదు, సినీ పరిశ్రమలో జరిగే అన్ని ఈవెంట్‌లలో హేమ యాక్టివ్‌గా పాల్గొంటుంది. ఇటీవల హేమ ఓ ఇంటర్వ్యూలో తనకు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు మధ్య వచ్చిన మనస్పర్థలకు గురించి చెప్పగా, కొందరు ఆ విషయాన్ని పూర్తిగా తెలుసుకోకుండానే నెగెటివ్‌గా చూపినట్లు చెప్పి మండిపడింది. 
 
టాలీవుడ్‌లో నాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ గాడ్ ఫాదర్ లాంటివారు. ఆయన చిత్రాలలో నటించిన పాత్రల వల్లే నాకు మంచి పేరు వచ్చింది. నాకు రాజకీయ ప్రవేశం కూడా ఈ క్రేజ్‌తోనే సాధ్యమైందని వ్యాఖ్యానించింది. నువ్వు నాకు నచ్చావ్ నుండి నాకు ఆయన అవకాశాలు ఇస్తూనే ఉన్నారు, నా కోసం సినిమాలో ఓ పాత్ర రాయండని అడిగే ధైర్యం కూడా ఉందని తెలిపింది. 
 
ఓ ప్రముఖ మీడియా సంస్థకు నేనిచ్చిన ఇంటర్వ్యూ ప్రోమోను మాత్రమే చూసి, త్రివిక్రమ్, పూరి జగన్నాథ్‌పై హేమ సంచలన వ్యాఖ్యలు అంటూ వార్తలు రాసేసాయి. అసలు ఏం చెప్పానో పూర్తిగా చూడకుండా వార్తలు వేస్తున్నారు, వెధవల్లాగా తయారయ్యారు, అయినా నాకు గాడ్ ఫాదర్ లాంటి త్రివిక్రమ్‌పై నేనెందుకు నెగటివ్‌గా చెప్తానంటూ ఘాటుగా స్పందించారు. 
 
మీ గురించి నిజాలు తెలుసుకోకుండా ఇలాగే రాస్తే ఊరుకుంటారా అని ప్రశ్నించింది. త్రివిక్రమ్ గారి డైరెక్టర్ ఒకరు నా రెమ్యునరేషన్ విషయంలో తల దూర్చగా, నేను కంప్లైంట్ చేసినా పట్టించుకోకపోవడంతో అలిగాను. ఆ తర్వాత తన అసిస్టెంట్ డైరెక్టర్ తప్పు అని తెలుసుకుని త్రివిక్రమ్ అతడిని తీసేశారు. ఇదీ జరిగిన విషయమంటూ తెలియజేసారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహర్షి సినిమాకి మహేష్ యాడ్స్‌తో చిక్కులు..అందుకే ఆలస్యం