Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'ఆర్ఆర్ఆర్'కు మొదటి అవాంతరం.. చరణ్‌కు గాయం

Advertiesment
ram charan
ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ చిత్రంలో చెర్రీ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా, ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో కనిపించనున్నాడు. రియల్ కారెక్టర్స్‌తో కూడిన ఫిక్షన్ కథగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ పూణెలో జరుగుతోంది. ఇందుకోసం ఇటీవలే ఈ చిత్ర యూనిట్ అక్కడకు వెళ్లింది.
 
అయితే ఈ షూటింగ్‌లో రామ్ చరణ్‌కు గాయమైంది. దీంతో పూణె షెడ్యూల్‌ను రద్దు చేసింది చిత్ర యూనిట్. ఈ విషయాన్ని నిర్మాతలు సోషల్ మీడియాలో వెల్లడించారు. మంగళవారం జిమ్‌లో వర్కవుట్లు చేస్తుండగా రామ్ చరణ్‌ కాలిమడమకు చిన్న గాయం జరిగింది. అందుకే పూణె షెడ్యూల్‌ను రద్దు చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. షూటింగ్‌ను మూడు వారాల తర్వాత మళ్లీ ప్రారంభిస్తామని చిత్ర యూనిట్ పేర్కొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'సాహో'తో చిందేయనున్న బ్రిటిష్ పాప్ సింగర్ కైలీ