Publish Date: Wed, 03 Apr 2019 (12:11 IST)
Updated Date: Wed, 03 Apr 2019 (12:13 IST)
అవును.. సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లోనూ ఒక్కటయ్యారు.. వీరెవరు అనే కదా ఆలోచిస్తున్నారు. వాళ్లిద్దరే సినీ లెజెండ్స్ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, దశావతారం హీరో కమల్ హాసన్. తద్వారా తమిళనాడు రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంటుంది. తమిళనాడు రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది.
ఈ మేరకు కమలహాసన్ పార్టీకి రజనీకాంత్ మద్దతు ప్రకటించారని స్వయంగా కమల్ వెల్లడించారు. గతంలో తన పార్టీ కేంద్ర కార్యాలయంలో భేటీ సందర్భంగా రజనీ మద్దతును తాను కోరారని, అందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించాలని రజనీ ఆకాంక్షించారని- రేపటి రోజు మనదేనని చెప్పారని తెలిపారు.
నిజాయితీగా పార్టీ నడుపుతున్నామని.. కులమతాలకు అతీతంగా తమ పార్టీ వుంటుందని కమల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. డీఎంకే పార్టీ నోట్లను పంచుతోందని.. తమ పార్టీ నిజాయితీగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీకి తమ పార్టీ బీ-టీమ్ కాదని వెల్లడించారు. దీంతో సినిమాల్లో కలిసి నటించిన కమల్, రజనీ.. ఇక రాజకీయాల్లోనూ కలిసి పనిచేస్తారని తెలుస్తోంది.