Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిర్మాతగా మారుతున్న చెర్రీ హీరోయిన్

Advertiesment
నిర్మాతగా మారుతున్న చెర్రీ హీరోయిన్
, శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (14:46 IST)
రామ్ చరణ్ నటించిన నాయక్ సినిమాలో కాజల్ అగర్వాల్‌తో పాటు నటించిన మరో హీరోయిన్ అమలా పాల్ అందరికీ తెలిసే ఉంటుంది. తెలుగులో పెద్దగా సినిమాలు చేయనప్పటికీ... తమిళ పరిశ్రమలో మాత్రం ఈ అమ్మడికి హిట్స్ చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నాయి. దర్శకుడు విజయ్‌తో పెళ్లి, విడాకుల వ్యవహారం ముగిసాక కొంత కాలం సినిమాలు మానేసిన అమలా పాల్ ఇప్పుడు కొత్తగా నిర్మాతగా మారబోతోంది.


అయితే తెలుగులో కాదు తమిళంలో... కడవేర్ అనే సినిమాతో ప్రొడ్యూసర్‌గా పరిచయం కాబోతోంది. సినిమాలోని కంటెంట్ కారణంగా తాను ఈ రిస్క్ తీసుకుని పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తోన్నట్లు అమలా పాల్ చెప్తోంది. శవాల మీద ప్రయోగాలు చేసే మెడికల్ స్టూడెంట్స్ బ్యాక్ డ్రాప్‌లో క్రైమ్ థ్రిల్లర్ గా దీన్ని రూపొందనున్న ఈ సినిమాలో... అమలా పాల్ ఫోరెన్సిక్ డాక్టర్ భద్రగా చాలా కీలకమైన పాత్ర పోషిస్తోంది. కేరళను కుదిపేసిన ఓ రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఆధారంగా ఇది రూపొందిస్తున్నట్టు తెలిసింది. కాగా... దర్శకుడు కూడా కొత్తవాడే. 
 
వైవాహిక జీవితం డిస్టర్బ్ అయ్యాక కొంత గ్యాప్ తీసుకున్న అమలా పాల్ తర్వాత ఎక్కువ రోజులు హీరొయిన్‌గా కొనసాగలేకపోయింది. పెళ్ళైపోయింది కాబట్టి ఆటోమేటిక్‌గా దాని ప్రభావం అవకాశాల మీద కూడా పడిందనే చెప్పుకోవాలి. అందుకే అవకాశాల కోసం ఎదురుచూడడం, ఎవరినో అడగడం వంటి వాటికి బదులుగా తానే నిర్మాతగా మారిపోయింది. 
 
ఈ మధ్యకాలంలో ఇలా సినిమాల నిర్మాణ రంగం వైపు వస్తున్న కథానాయికల సంఖ్య బాగానే ఉంటోంది. కాజల్ అగర్వాల్ కూడా ఇదే తరహా ప్లానింగ్‌తో మీడియం బడ్జెట్ మూవీస్ తీసేందుకు ప్రణాళిక వేసుకుంటున్నట్లు వినికిడి. వయస్సు మీద పడిన హీరోలందరూ రాజకీయాలలోకి వెళ్తున్నట్లు... వయస్సు మీద పడి అవకాశాలు తగ్గిన హీరోయిన్‌లందరూ నిర్మాతలైపోతారేమో మరి...

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నయన్ సినిమాపై నెగెటివ్ కామెంట్స్.. ప్రియుడిపై కేసు పెడతానంటూ నిర్మాత ఫైర్