Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లక్ష్మీస్‌ ఎన్టీఆర్ చిత్రం రిలీజ్‌పై సుప్రీం కోర్టుకెళ్లిన చిత్ర నిర్మాత..

Advertiesment
లక్ష్మీస్‌ ఎన్టీఆర్ చిత్రం రిలీజ్‌పై సుప్రీం కోర్టుకెళ్లిన చిత్ర నిర్మాత..
, సోమవారం, 1 ఏప్రియల్ 2019 (13:00 IST)
గత కొన్ని రోజులుగా వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్న ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రం విడుదలను ఏపీలో నిలిపివేయడంపై ఆ చిత్ర నిర్మాత రాకేశ్‌రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విడుదల చేయకుండా ఏపీ హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేయాలని పిటిషన్‌ దాఖలు చేసారు. 
 
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం విడుదలపై ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ఏప్రిల్ 3వరకు స్టే విధించిన సంగతి తెలిసిందే. సినిమా ప్రివ్యూను న్యాయమూర్తులు చూశాక, తదుపరి నిర్ణయం వెల్లడిస్తామని కోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో నిర్మాత రాకేశ్‌రెడ్డి సుప్రీం కోర్టు తలుపుతట్టారు. అత్యున్నత న్యాయస్థానం ఎలా స్పందిస్తుందో చూడాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే మరి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అల్లు అర్జున్ - త్రివిక్రమ్ ప్రాజెక్ట్‌లో ఆయన కూడానా!