Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

''లక్ష్మీస్ ఎన్టీఆర్'' విడుదలకు బ్రేక్.. ఏప్రిల్ 15వరకు నో రిలీజ్

Advertiesment
''లక్ష్మీస్ ఎన్టీఆర్'' విడుదలకు బ్రేక్.. ఏప్రిల్ 15వరకు నో రిలీజ్
, గురువారం, 28 మార్చి 2019 (18:18 IST)
''లక్ష్మీస్ ఎన్టీఆర్'' విడుదలకు బ్రేక్ పడింది. ఈ సినిమా మార్చి 29న విడుదల కావాల్సి వుండగా, హైకోర్టు షాకిచ్చింది. ఈ చిత్రాన్ని విడుదల చేయకూడదంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నేపథ్యంలో ఏప్రిల్ 15వ తేదీ వరకు సినిమా విడుదలను నిలుపుదల చేయాలని ఆదేశించింది. 
 
ఈ చిత్రాన్ని 15వ తేదీ వరకు సినిమా థియేటర్లతో పాటు సోషల్ మీడియా వేదికగా విడుదల చేయకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా విడుదలైన ట్రైలర్ ద్వారా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును విమర్శించడం కనిపించడంతో.. ఈ చిత్రం విడుదలైతే ఎన్నికల సమయంలో టీడీపీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందంటూ... పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు. 
 
వాదనలను విన్న హైకోర్టు ఏప్రిల్ 15వ తేదీ వరకు సినిమాను ప్రదర్శించకూడదంటూ తీర్పును వెలువరించింది. ఒకవేళ ఎన్నికలయ్యాకైనా ఈ సినిమాను విడుదల చేయాలని వర్మ హైకోర్టును కోరుతారో లేకుంటే ఎన్నికల ఫలితాల వరకు ఈ చిత్రాన్ని ఆపేసేందుకు టీడీపీ నేతలు పట్టబుడుతారో తెలియాలంటే.. వేచి చూడాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్.. నా కొడుకు నారా లోకేష్‌పై ఒట్టేసి చెప్తున్నా... (ట్రైలర్)