Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్.. నా కొడుకు నారా లోకేష్‌పై ఒట్టేసి చెప్తున్నా... (ట్రైలర్)

Advertiesment
లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్.. నా కొడుకు నారా లోకేష్‌పై ఒట్టేసి చెప్తున్నా... (ట్రైలర్)
, గురువారం, 28 మార్చి 2019 (17:59 IST)
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రంపై కొంతకాలంగా వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును విలన్‌గా చూపించారని, ఇది ఎన్నికలపై ప్రభావం పడుతుందని, పోలింగ్ ముగిసే వరకు సినిమాను ఆపాలంటూ ఇప్పటికే టీడీపీ నేతలు ఎలక్షన్ కమీషన్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు, కోర్టును ఆశ్రయించారు. 
 
తెలంగాణ హైకోర్ట్ టీడీపీ నేతలు వేసిన పిటీషన్ తోసిపుచ్చుతూ విడుదలకు లైన్ క్లియర్ చేసింది. సెన్సార్ నుంచి కూడా ఈ చిత్రానికి క్లీన్ 'యూ' సర్టిఫికెట్ వచ్చింది. ఈ సినిమా శుక్రవారం (మార్చి 29)వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో తాజాగా మరో ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. 
 
''ఈ ట్రైలర్‌ వాడు నా పిల్లలూ కలిసి నన్ను చంపేశారు''-ఎన్టీఆర్ అనే వాక్యంతో మొదలైంది. ఆపై ఆసక్తికర సన్నివేశాల నడుమ ట్రైలర్ నడిచింది. లక్ష్మీ పార్వతీ రాకతో పార్టీలో, ఎన్టీఆర్ కుటుంబంలో ఏర్పడిన పరిణామాలను వర్మ ఇందులో చూపారు. 
 
ప్రజలే తనను ఇంతవాడిని చేశారని.. అదే ప్రజలు ప్రస్తుతం నన్ను వద్దనుకుంటున్నారని ఎన్టీఆర్ చెప్పే డైలాగ్, లక్ష్మీ పార్వతీపై చంద్రబాబు చెప్పే డైలాగ్స్, శ్రీదేవి, జయసుధ వంటి మహానటీమణులతో పరిచయమున్న ఆయనికి ఆమెలో ఏముందని.. దగ్గర చేసుకున్నాడనే డైలాగులు, కొట్టినా, చంపినా తాను ఇక్కడకొచ్చింది.. ఆయనకు సేవ చేయడానికేనని లక్ష్మీ పార్వతి చెప్పిన డైలాగులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 
 
వెన్నుపోటు, చంద్రబాబు డైలాగ్స్ నారా లోకేష్‌పై ఒట్టేసి చెప్తున్నా.. టైమ్ రాదు.. మనమే రప్పించుకోవాలి అనేవి బాగున్నాయి. వెన్నుపోటు పొడిచారు.. నమ్మించి వంచిచారని ఎన్టీఆర్ డైలాగ్స్.. అధికారాన్ని బాబు సొంతం చేసుకునే సన్నివేశాలు ఈ ట్రైలర్‌లో వున్నాయి. ఈ ట్రైలర్‌ను మీరూ ఓ లుక్కేయండి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రోజూ బ్రష్‌ చేసుకోరా..?