ప్రజాశాంతి పార్టీ పెట్టి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లోను తీవ్ర చర్చకు తెరతీశారు కె.ఎ.పాల్. శాంతి దూతగా కె.ఎ.పాల్‌కు ఒకప్పుడు మంచి పేరు ఉండేది. అయితే ఆయన రాజకీయ పార్టీ పెట్టి ఎపిలో 175స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్థమయ్యారు. ప్రచారాన్ని జోరుగా కొనసాగించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ విజయం ఖాయమని.. చరిత్ర తిరగ రాస్తామని కె.ఎ. పాల్ చెప్పారు.
ఎన్నికలకు 14 రోజులు మాత్రమే సమయం ఉంది. అయితే ఇప్పటివరకు 75స్థానాల్లో మాత్రమే కె.ఎ.పాల్ పోటీ చేస్తున్నట్లు తెలిపారు. అందుకు కారణం కూడా చెప్పారు కె.ఎ.పాల్. తమ పార్టీ కార్యాలయంలోని బి-ఫారాలు.. స్టాంప్ ప్యాడ్లను ఎవరో ఎత్తుకెళ్ళారట. అందుకే అవి లేకపోవడంతో పోటీ చేయడం లేదని చెబుతున్నారు కె.ఎ.పాల్. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘాలన్ని కోరుతానని.. ఎన్నికలకు సమయం ఇవ్వమని కోరనున్నట్లు కూడా కె.ఎ.పాల్ తెలిపారు.