పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో గొడవ అయిన మాట నిజమేనని.. హాస్యనటుడు అలీ తెలిపాడు. ఆలీతో సరదాగా కార్యక్రమానికి గెస్ట్‌గా వచ్చిన పవన్ మాజీ సతీమణి రేణూ దేశాయ్.. ఈ వ్యవహారంపై రివర్స్ ప్రశ్న వేయడంతో అలీ ఈ నిజాన్ని వెల్లగక్కాడు.
ఈ కార్యక్రమంలో తానో సీరియస్ ప్రశ్న అడగాలని అనుకుంటున్నానని చెప్పిన రేణూ, "మీకు కల్యాణ్ గారికి చాలా పెద్ద గొడవైందని విన్నాను. నిజమేనా?" అని అడిగితే, దానికి అలీ "అయ్యింది" అని అలీ సమాధానం ఇచ్చారు. ఇంకా ఈ ఇంటర్వ్యూలో తన పేరును రేవతి అనో లేదా రేవా అనో పెడితే బాగుండేదని చెప్పుకొచ్చారు.
ఇకపోతే.. హాస్య నటుడు అలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందు పవన్ కల్యాణ్‌తో ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయిన సంగతి తెలిసిందే.
వైసీపీలో చేరిన తరువాత, అలీ లాంటి వ్యక్తిని తాను ఇంతవరకూ చూడలేదని, సాయం పొంది మోసం చేసిన అతన్ని చూసిన తరువాత, ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదని పవన్ తీవ్రస్థాయిలో మండిపడిన సంగతి తెలిసిందే. వాటిని అలీ సైతం గట్టిగానే తిప్పికొట్టారు.