Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎడమకాలికి బదులు కుడి కాలికి ఆపరేషన్ చేశారు.. ఇద్దరు ప్రైవేటు వైద్యుల గుర్తింపు రద్దు

Webdunia
శుక్రవారం, 14 ఏప్రియల్ 2023 (10:56 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు ప్రైవేటు వైద్యుల గుర్తింపును రాష్ట్ర వైద్య విధాన మండలి రద్దు చేసింది. వీరిలో కరణ్ ఎం పాటిల్ అనే వైద్యుడి గుర్తింపును ఆరు నెలల పాటు, సీహెచ్. శ్రీకాంత్ అనే మరో వైద్యుడి గుర్తింపును మూడు నెలల పాటు రద్దు చేస్తూ తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి ఛైర్మన్ వి.రాజలింగం గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఇద్దరు వైద్యులు తమ సర్టిఫికేట్లను తక్షణం రాష్ట్ర వైద్య మండలికి అందజేయాలని ఆదేశించారు. 
 
హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌ ప్రాంతానికి చెందిన కరణ్‌ ఎం.పాటిల్‌ అనే ఆర్థోపెడిషియన్‌.. ఓ రోగికి ఎడమ కాలికి ఆపరేషన్‌ చేయాల్సి ఉండగా కుడి కాలికి చేశారు. ఈ తప్పిదాన్ని రెండు రోజుల అనంతరం గుర్తించి తిరిగి ఎడమ కాలికి ఆపరేషన్‌ చేశారు. దీనిపై బాధితులు డీఎంహెచ్‌వోకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేసి వైద్యుడి తప్పిదాన్ని నిర్ధరించారు.
 
అదేవిధంగా మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ వ్యక్తి డెంగ్యూతో ఆసుపత్రిలో చేరగా వైద్యుడు సీహెచ్‌.శ్రీకాంత్‌ అతన్ని సకాలంలో మెరుగైన వైద్యం కోసం పెద్ద ఆసుపత్రికి తరలించాలని సిఫారసు చేయలేదు. దీంతో రోగి మృతి చెందారు. బాధితులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో విచారణ చేసి వైద్యుడి నిర్లక్ష్యాన్ని నిర్ధరించారు. కలెక్టర్‌ నివేదిక నేపథ్యంలో రాష్ట్ర వైద్యమండలి విచారణ చేసి శ్రీకాంత్‌ గుర్తింపును రద్దు చేసినట్లు ఉత్తర్వుల్లో తెలిపారు. గుర్తింపు రద్దుపై 60 రోజుల్లో అప్పీల్‌ చేసుకునేందుకు ఇద్దరు వైద్యులకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments