Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకునేవారి పట్ల సానుభూతి చూపించను : రాజమౌళి

Advertiesment
Rajamouli
, గురువారం, 13 ఏప్రియల్ 2023 (12:37 IST)
సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని మోసపోయే వాళ్ల పట్ల తాను ఏమాత్రం సానుభూతి చూపించబోనని ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి స్పష్టం చేశారు. పైగా, శ్రమించకుండా ఊరకే డబ్బులు రావన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు.
 
హైదరాబాద్ నగరంలో హ్యాక్ సమ్మిట్ 2023 అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో రాజమౌళి పాల్గొని ప్రసంగిస్తూ, ఉచితంగా డబ్బులు వస్తాయని, తక్కువ సమయంలో డబ్బులు రెట్టింపు అవుతాయన్నా అది ఖచ్చితంగా మోసమని విషయాన్ని గుర్తించాలన్నారు. చిన్న కార్మికుడి నుంచి పెద్ద వ్యాపారవేత్తలవరకు సైబర్ మోసాల బారినపడుతున్నారన్నారు. ఎవరికైనా డబ్బులు పంపించే ముందు ఒక్క నిమిషం ఆలోచించాలి చెప్పారు.
 
ముఖ్యంగా, నగ్న ఫోన్ కాల్స్ చేసి మోసం చేసేవారిపట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. కొత్త నంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌ను లిఫ్ట్ చేయకపోవడమే మంచిదన్నారు. ఇకపోతే, చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచన చేశారు. వారికి 18 యేళ్లు వచ్చేంత వరకు మొబైల్ ఫోన్స్ కొనివ్వకపోవడమే మంచిదన్నారు. సైబర్ నేరాలపై చేసే ప్రచారాలకు తనతో పాటు ఇతర సినీ ప్రముఖులు కూడా వస్తారని హామీ ఇచ్చారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పి.ఏస్.2 లో వీర వీర సూరా సాంగ్ లైవ్ పెర్ ఫామ్ ఇచ్చిన రెహమాన్, చిత్ర