Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పి.ఏస్.2 లో వీర వీర సూరా సాంగ్ లైవ్ పెర్ ఫామ్ ఇచ్చిన రెహమాన్, చిత్ర

veera song rehaman
, గురువారం, 13 ఏప్రియల్ 2023 (12:29 IST)
veera song rehaman
మణిరత్నం పొన్నియిన్ సెల్వన్: 2 ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ప్రఖ్యాత తమిళ రచయిత కల్కి కృష్ణమూర్తి నవలల ఆధారంగా మణిరత్నం దర్శకత్వం వహించిన ఎపిక్ హిస్టారికల్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ఇది. మద్రాస్ టాకీస్‌తో కలిసి లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది, అకాడమీ అవార్డ్-విజేత స్వరకర్త A. R. రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఇప్పుడు 4DXలో వస్తున్న మొదటి సౌత్ ఇండియన్ వెంచర్. ఈ సినిమాలో రాజు వీరత్యం గురించి రాసిన పాటను రెహ్మాన్ చెనై లో ప్రీరిలీజ్ లో ప్రత్యక్ష ప్రదర్శన చేశారు. వీర వీర సూరా.. అంటూ సాగే ఈ పాట ఐదు భాషల్లో విడుదల అయింది. 
 
4DX టెక్నాలజీని ఉపయోగించడం వలన స్క్రీన్‌పై విజువల్స్ కనువిందు చేస్తాయని మణిరత్నం తెలిపారు. గత సంవత్సరం విడుదలైన పొన్నియన్ సెల్వన్: 1 లో  ఉత్కంఠభరితమైన విజువల్స్,  యాక్షన్‌ను చూసిన తర్వాత భారీ దృశ్యం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినీ ప్రేమికులకు సంగీతంలా అలరిస్తుందని అంటున్నారు.  పొన్నియన్ సెల్వన్: 1 బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా 500 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించింది. పొన్నియన్ సెల్వన్: 1 ఆ సంఖ్యలను అధిగమించాలని టీమ్ చూస్తోంది,
 
పాన్-ఇండియన్ వెంచర్‌గా విడుదలవుతున్న పొన్నియిన్ సెల్వన్: 2 తెలుగు, హిందీ, కన్నడ మరియు మలయాళ భాషల్లో IMAX ఫార్మాట్ స్క్రీన్‌లపై విడుదల కానుంది. 'చియాన్' విక్రమ్ అదిత కరికాలన్‌గా, ఆ తర్వాత కార్తీ వల్లవరైయన్ వంతీయతేవన్‌గా, జయం రవిగా అరుణ్‌మోళి వర్మన్‌గా, త్రిష కుందవాయిగా, ఐశ్వర్య రాయ్ బచ్చన్ కనిపించనున్నారు. నందిని మరియు మందాకినిగా ద్విపాత్రాభినయం, ఆ తర్వాత ఐశ్వర్య లక్ష్మి, ప్రకాష్ రాజ్, ఆర్. శరత్‌కుమార్, పార్థిబన్, జయరామ్, ప్రభు, శోభితా ధూళిపాళ, విక్రమ్ ప్రభు, లాల్, రెహమాన్, కిషోర్, అశ్విన్ కాకుమాను, నిజల్‌గల్ రవి, వినోదిని వైద్యనాథన్, జయచిత్ర , మోహన్ రామన్, మరియు రియాజ్ ఖాన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకునేవారి పట్ల సానుభూతి చూపించను : రాజమౌళి