Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నటితో శృంగారంలో పాల్గొన్న కేసులో డోనాల్డ్ ట్రంప్ అరెస్టు .. దేశ చరిత్రలోనే తొలిసారి..

Advertiesment
donald trump
, బుధవారం, 5 ఏప్రియల్ 2023 (08:34 IST)
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోలాల్డ్ ట్రంప్ అరెస్టు అయ్యారు. గత 2006 సంవత్సరంలో ఓ హోటల్‌లో నటితో శృంగారంలో పాల్గొన్నాడన్న కేసులో ఆయన్ను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయనపై ఏకంగా 34 అభియోగాలు నమోదు చేశారు. కాగా, ఒక మాజీ అధ్యక్షుడు శృంగారం కేసులో అరెస్టు కావడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. అయితే, డోనాల్డ్ ట్రంప్ మాత్రం ఈ కేసులో ఉద్దేశ్యపూర్వకంగా ఇరికించారని, తనకేపాపం తేలియదంటూ వాపోతున్నారు. 
 
హష్‌మనీ కేసులో ట్రంప్‌పై 34 అభియోగాలు నమోదుకాగా, ఆయన్ను మంగళవారం మధ్యాహ్నం స్థానిక కాలమానం ప్రకారం 2.30 గంటలకు ఆయన మన్‌హటన్ కోర్టులో లొంగిపోయారు. ఆ వెంటనే ఆయనను ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. గత 2006లో లేక్‌తాహో హోటల్‌‍లో ట్రంప్ తనతో శృంగారంలో పాల్గొన్నట్టు పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్ ఇటీవల వెల్లడించి ప్రకంపనలు రేపింది. ట్రంప్, తాను ఓ కార్యక్రమంలో కలుసుకున్నామని, ఆ తర్వాత తనతో ఆయన శృంగారంలో పాల్గొన్నారని చెప్పారు. 
 
అయితే, 2016 అధ్యక్ష ఎన్నికలకు ముందు ఈ విషయాన్ని బహిర్గతం చేయకుండా ఉండేందుకు తనకు భారీ మొత్తంలో డబ్బు ముట్టజెప్పారన చెప్పారు. దీంతో మనహటన్ కోర్టులో ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. ట్రంప్ తన అడ్వకేట్ కోహెన్ ద్వారా 1.30 లక్షల డాలర్లు డేనియల్స్‌కు ఇచ్చినట్టు ప్రాసిక్యూషన్ తన వాదనలు వినిపించింది. కోహెన్ కూడా ఈ విషయాన్న నిర్ధారించింది. ఈ నేపథ్యంలో ట్రంప్ కోర్టులో లొంగిపోయారు. ట్రంప్‌ను సాంకేతికంగా అరెస్టు చేసినప్పటికీ ఆయన చేతికి బేడీలు వేయలేదు. 
 
కాగా, తనపై వచ్చిన ఆరోపణలను ట్రంప్ ఖండించారు. డేలియల్‌ను కలిసిన మాట వాస్తవమేనని, అయితే, ఆమెతో తనకు లైంగిక సంబంధాలు లేవంటూ కోర్టులో తన వాదనలు వినిపించారు. ఈ విషయంలో తాను నిర్ధోషినని, తనను దోషిగా ప్రకటించవద్దని కోర్టును కోరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫ్లిప్‌కార్ట్‌పై 20వేల రూపాయల లోపు అగ్రగామి ల్యాప్‌టాప్‌లలో తన సత్తా చాటిన ప్రైమ్‌బుక్‌ 4జీ