Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 26 March 2025
webdunia

రాహుల్ గాంధీపై దావా వేస్తానంటున్న లలిత్ మోడీ.. ఎందుకో తెలుసా?

Advertiesment
lalith modi
, గురువారం, 30 మార్చి 2023 (14:13 IST)
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై దావా వేస్తానంటూ ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ తెలిపారు. ఐపీఎస్ స్కామ్‌తో పాటు పలు కేసుల్లో చిక్కుకుని అరెస్టు నుంచి తప్పించుకుని పారిపోయిన లలిత్ మోడీ ఇపుడు రాహుల్ గాంధీపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. 
 
ఇప్పటికే దేశంలోని దొంగల పేర్లన్నీ మోడీ ఇంటి పేరుతోనే ఉంటారంటూ రాహుల్ గతంలో చేసిన వ్యాఖ్యలపై చిక్కుల్లో పడిన విషయం తెల్సిందే. దీనిపై గుజరాత్‌కు చెందిన మాజీ మంత్రి పూర్ణేష్ మోడీ దాఖలు చేసిన పరువురు నష్టం దావా కేసులో రాహుల్‌కు రెండేళ్ల జైలుశిక్ష విధిస్తూ సూరత్ కోర్టు తీర్పునిచ్చింది.
 
ఇలాంటి సమయంలో ఐపీఎల్‌ మాజీ ఛైర్మన్‌ లలిత్‌ మోడీ.. రాహుల్‌పై మండిపడ్డారు. మనీ లాండరింగ్‌ వ్యవహారంలో తనపై అసత్య, నిరాధార ఆరోపణలు చేస్తున్నందుకుగానూ కాంగ్రెస్‌ నేతపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఈ మేరకు వరుస ట్వీట్లలో రాహుల్‌, కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు గుప్పించారు.
 
'నేను న్యాయప్రక్రియ నుంచి పారిపోయానని గాంధీ మద్దతుదారులు, ప్రతి ఒక్కరూ ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకు? ఎలా? రాహుల్‌ గాంధీ మాదిరిగా.. ఇప్పటివరకు నేను ఏ కేసులోనైనా దోషిగా తేలానా? ప్రతిపక్ష నేతలు ఏమీ చేయలేక.. ఇలా అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారని ఇప్పుడు సామాన్య పౌరుడు కూడా అర్థం చేసుకోగలడు. 
 
ఈ తప్పుడు ఆరోపణలకుగానూ రాహుల్‌కు వ్యతిరేకంగా నేను యూకే కోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నా. అప్పుడైనా ఒక బలమైన ఆధారాలతో రావాల్సి ఉంటుంది. అవి దొరక్క ఆయన ఫూల్‌ అవడం నేను చూస్తాను. గాంధీ కుటుంబానికి సన్నిహితులైన చాలా మంది కాంగ్రెస్‌ నేతలకు విదేశాల్లో ఆస్తులున్నాయి. మీ అసత్య ఆరోపణలతో ప్రజలను తెలివితక్కువ వారిని చేయలేరు. తాము మాత్రమే ఈ దేశాన్ని పాలించేందుకు అర్హులమని గాంధీ కుటుంబం భావిస్తోంది' అంటూ లలిత్ మోడీ ఆరోపించారు. 
 
'గత 15 ఏళ్లలోనే నేను ఒక్క రూపాయి కూడా అక్రమంగా దోచుకున్నట్లు ఇప్పటివరకు నిరూపణ కాలేదు. అయితే, నిజమేంటంటే.. దాదాపు 100 బిలియన్‌ డాలర్లను సంపాదించి పెట్టిన ప్రపంచంలోనే అత్యంత గొప్ప క్రీడా టోర్నీని నేను నిర్వహించాను. 1950 నుంచి కాంగ్రెస్‌ ఈ దేశం కోసం చేసిన దానికంటే ఎక్కువగా, వారి ఊహలకు మించి మోడీ కుటుంబం (ఆ కమ్యూనిటీని ఉద్దేశిస్తూ) ఈ దేశానికి సేవ చేసింది. నేను కూడా ఎక్కువే చేశాను. నేను దోచుకున్నానని మీరు ఎంత అరిచినా లాభం లేదు. ఇక భారత్‌లో కఠినమైన చట్టాలను తీసుకొచ్చిన తర్వాత నేను తప్పకుండా తిరిగొస్తాను' అని హెచ్చరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చదువుకోమని చెప్పారని తొమ్మిదేళ్ల చిన్నారి సూసైడ్