Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివేకా హత్య కేసు : సీబీఐ అదుపులో వైఎస్ అవినాశ్ రెడ్డి ప్రధాన అనుచరుడు

Webdunia
శుక్రవారం, 14 ఏప్రియల్ 2023 (10:11 IST)
వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు ఒక అడుగు ముందుకు వేయడం.. నాలుగు అడుగులు వెనక్కి వేయడం జరుగుతుంది. ఈ క్రమంలో తాజాగా కడప వైకాపా ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ప్రధాన అనుచరుల్లో ఒకరైన గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గూగుల్ టేకౌట్ ద్వారా భాస్కర్ రెడ్డి ఇంట్లో ఆయన ఉన్నట్టు గుర్తించిన సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత పులివెందుల నుంచి కడప సెంట్రల్ జైల్ అతిథి గృహానికి తీసుకెళ్లి విచారణ జరుపుతున్నారు. 
 
రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైకాపా నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సీబీఐ విచాణరణ జరుపుతున్న విషయం తెల్సిందే. ఇందులోభాగంగా, వివేకా హత్య జరిగిన రోజున అవినాష్, శివశంకర్ రెడ్డిలతో పాటు ఘటనాస్థలికి ఉదయ్ కుమార్ రెడ్డి కూడా వెళ్లినట్టు, ఆ రోజు అంబులెన్స్, ఫ్రీజర్, వైద్యులను రప్పించడంలో ఈయన కీలక పాత్ర పోషించినట్టు సీబీఐ ఓ నిర్ధారణకు వచ్చింది. వివేకా మృతదేహానికి ఉదయ్ తండ్రి జయప్రకాష్ రెడ్డి బ్యాండేజ్ కట్లు కట్టినట్టు అనుమానిస్తున్నారు. ఈ కేసులో ఉదయ్‌ను గతంలో పలుమార్లు విచారించిన విషయం తెల్సిందే.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యు.ఎస్‌లో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీ ఏర్పాట్లు

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments