Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గ్రాఫిక్స్ మాయాజాలంతో శాకుంతలం ఎలా తీశారంటే.. రివ్యూ

Shakuntalam
, శుక్రవారం, 14 ఏప్రియల్ 2023 (09:09 IST)
Shakuntalam
నటీనటులు: సమంత, దేవ్‌ మోహన్‌, మోహన్‌బాబు, సచిన్‌ ఖడ్కేర్‌, ప్రకాష్‌రాజ్‌, అనన్య నాగళ్ళ, గౌతమి, అతిది బాలన్‌, అల్లు అర్హ తదితరులు
సాంకేతికత: కెమెరా: శేఖర్‌ వి.జోసెఫ్‌, సంగీతం: మణిశర్మ,  ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, మాటలు: సాయిమాధవ్‌ బుర్రా, నిర్మాతలు: నీలిమగుణ, శ్రీవేంకటేశ్వరక్రియేషన్స్‌, దర్శకత్వం: గుణశేఖర్‌.
విడుదల: 14.04.2023 శుక్రవారం
 
శాకుంతలం సినిమాకు సమంత ప్రత్యేక ఆకర్షణ. టైటిల్‌ రోల్‌ ప్లే చేసింది. పురాణాల్లోని కథను తీసుకుని రుద్రమదేవి దర్శకుడు గుణశేఖర్‌ నిర్మించి దర్శకత్వం వహించారు. కొద్దిరోజులకు దిల్‌ రాజు సమర్పకునిగా వ్యవహరించారు. పబ్లిసిటీ తన భుజాన వేసుకున్నారు. ఈ కథ అందరికీ తెలిసిందే. అలాంటి కథను 3డి ఫార్మెట్‌లో తెలియజెప్పడమే తన ఉద్దేశ్యమని గుణశేఖర్‌ చెప్పారు. మరి ఈరోజే విడుదలైన ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
 
కథ:
కొంగజాతి పక్షులు అప్పుడే పుట్టిన పాపను ముక్కున కరుచుకుని కణ్వ మహర్షి ఆశ్రమం పక్కన చెట్లలో వదిలేస్తుంది. మహర్షి, శిష్యులు పిల్లఏడుపు విని ఆమెను దగ్గరా తీసుకుని తన కుమార్తెగా కణ్వమహర్షి పెంచుతాడు. ఆమె కారణజన్మురాలని దివ్యదృష్టితో జరిగింది తెలుసుకుని శిష్యులకు చెబుతాడు. విశ్వామిత్రుని తపస్సును భగ్నం చేసేందుకు ఇంద్రుడు పంపిన మేనక (మధుబాల) తపస్సును భంగం చేసి అతనితో కాపురం చేస్తుంది. ఫలితంగా ఈ పాప పుడుతుంది. ఆమెకు శాకుంతల అని పేరు ముని ఖరారు చేస్తారు.
 
ఇక ఆ రాజ్యాన్ని ఏలే పురువంశపు రాజు దుష్యంతుడి అడవిలో పులుల వేటకై వచ్చి వాటిని వెంబడిస్తూ కణ్వమహర్షి ఆశ్రమానికి వస్తాడు. అక్కడ శాకుంతలను చూసి తొలిచూపులోనే ప్రేమించేస్తాడు. గాంధర్వ వివాహం చేసుకుని ఒక్కటవుతారు. ఆ సమయంలో కణ్వ మహర్షి హిమాలయాల్లో శివుని కోసం యజ్ఞం చేస్తుంటాడు. అదే టైములో ఈ ఆశ్రమంలో ఓ యజ్ఞం చేస్తుంటారు. వాటిని అడ్డుకునే రాక్షసులను బుద్ధి చెపుతాడు దుష్యంతుడు. 
 
ఇక తన రాజ్యానికి వెళ్ళే సమయం ఆసన్నమైందని దుష్యంతుడు, శాంకుతలకు తన గుర్తుగా ఉంగరాన్ని ఆమె వేలికి తొడుగుతాడు. అలా వెళ్ళిన దుష్యంతుడు రాక్షసులకు శత్రువు.  పగతో రగిలిపోయిన రాక్షసులు దుష్యంతునికి పుట్టబోయే బిడ్డను నాశనం చేయాలని చూస్తారు. ఇక తిరిగివచ్చిన కణ్వ మహర్షి శాకుంతల గురించి విషయం తెలుసుకుని దుష్యంతుని రాజ్యానికి పంపిస్తాడు. కానీ అక్కడ నిండు సభలో ఆమె ఎవరో తనకు తెలీదని చెప్పడంతో శాకుంతల కులట అంటూ అందరూ రాళ్ళతో తరిమి కొడతాడు. దుష్యంతుడు ఇచ్చిన ఉంగం ఆమె చూపించాలని చూస్తే చేతికి ఉంగరం వుండదు. అది ఏమయింది? ప్రజలు తరిమికొట్టిన శాకుంతల ఎక్కడికి వెళ్ళింది? ఆ తర్వాత కథ ఏమిటి? అనేది మిగిలిన సినిమా.
 
విశ్లేషణ:
కాళిదాసు రచించిన నాటకం అభిజ్ఞాన శాకుంతలం. భారతీయ సాహిత్యంలో మంచి ప్రేమ కథగా ప్రసిద్ధి కెక్కింది. అలాంటి కథను రామారావు టైంలోనే అప్పట్లో అప్పటి భాషకు అనుగుణంగా తీశారు. ఆ తర్వాత తమిళంలోనూ వచ్చింది. ఇప్పుడు గుణశేఖర్‌ తీశారు. 3డి ఫార్మెట్‌లో తీయడం మంచిదే. సాహసం కూడా. ప్రేమకావ్యాన్ని, తెలిసిన కథను చెప్పడమూ సాహసమే. తెలీని కథను తీసుకుని ఆసక్తికరమైన మలుపుతో ప్రేక్షకుడు థ్రిల్‌ ఫీలయ్యే అంశాలతో ఆకట్టుకోవడం రాజమౌళి బాహుబలి, ఆర్‌.ఆర్‌.ఆర్‌. తీసి మెప్పించారు. ఆ తరహాలోనే తాను విజువల్‌ ఎఫెక్ట్స్‌ జోడిరచి ఆర్‌.ఆర్‌.ఆర్‌. సాంకేతిక టీమ్‌తో చేసిన సినిమా ఇది. ఈ కథను పుస్తకాల్లో చదువుతే కాస్త రిలీఫ్‌గా వుంటుంది. కానీ వెండితెరపై అంత కిక్‌ ఇవ్వదు. పాతకాలం కథ కాబట్టి నింపాదిగా కథనం నడుస్తుంది.
 
ప్రత్యేకంగా చెప్పాల్సింది గ్రాఫిక్స్‌, విజువల్స్‌తో కొండలు లోయలు, హిమాలయాలు, కాశ్మీర్‌ ప్రాంతంలో జరిగిన క్లయిమాక్స్‌ కథకు తగినవిధంగా చూపించారు. నటనాపరంగా సమంత, దుష్యంతులు సరిపోయారు. దుష్యంతునిగా తెలుగులో ఎవరూచేయకపోవడంతో దేవ్‌ నుతీసుకోవాల్సివ వచ్చింది. భరతుడిగా అల్లు అర్జున్‌ కుమార్తె ఆర్హ నటించి మెప్పించింది. 
 
ఇక దుర్వాస మహర్షి (మోహన్‌ బాబు) పాత్ర కథను మలుపు తిప్పుతుంది. కణ్వమహర్షిగా సచిన్‌ ఖడేడ్కర్‌ నటించాడు. 
టెక్నికల్‌గా ఈ సినిమా చాలా బాగుంది. మణిశర్మ సంగీతం, క్లయిమాక్స్‌ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి.
రొటీన్‌ ప్రేమకథ కావడంతో గ్రాఫిక్స్ మాయాజాలంతో తీసినా ఇది ఎంతమేరకు ఇప్పటి జనరేషన్‌ ఆదరిస్తారో చూడాల్సిందే.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సుప్రియ, రాధిక, స్వప్నాదత్‌లతో నిజం చెప్పించిన స్మిత