Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ రెండు సమస్యలతో బాధపడుతున్న హీరోయిన్ సమంత

Advertiesment
samanta
, గురువారం, 13 ఏప్రియల్ 2023 (08:51 IST)
టాలీవుడ్ హీరోయిన్ సమంత అస్వస్థతకు గురయ్యారు. ఆమె ప్రధాన పాత్ర పోషించిన చిత్రం "శాకుంతలం". ఈ నెల 14వ తేదీన విడుదలవుతుంది. ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీగా గడిపిన సమంత.. ఇపుడు చిన్నపాటి అస్వస్థతకు లోనయ్యారు. ప్రస్తుతం ఆమె జ్వరం, గొంతు నొప్పితో బాధపుడుతున్నారు. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. 
 
బుధవారం ఎంఎల్ఆర్‌ఐటీలో జరగాల్సిన "శాకుంతలం" ప్రమోషనల్ ఈవెంట్‌లో పాల్గొనడం లేదని తెలిపారు. వరుసగా ప్రమోషన్ ఈవెంట్స్‌లో పాల్గొనండ వల్ల అనారోగ్యానికి గురైనట్టు చెప్పారు. అందువల్ల ఈ ప్రమోషన్ కార్యక్రమానికి తాను హాజరుకాలేనని, మిగిలిన "శాకుంతలం" యూనిట్ సభ్యులంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాకు బైక్ న‌డ‌ప‌టం రాదు నడిపేవారంటే ఇష్టం : రానా ద‌గ్గుబాటి