Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శాకుంతలంలో సమంత పక్కన తెలుగు హీరోలు ఎందుకు చేయలేదు!

Advertiesment
shakuntala team
, బుధవారం, 12 ఏప్రియల్ 2023 (19:27 IST)
shakuntala team
గుణశేఖర్‌ దర్శక నిర్మాతగా తీసిన శాకుంతలంలో దుష్యంతుని పాత్ర కోసం తెలుగు హీరోలను ఆయన అప్రోజ్‌ అయ్యారట. కానీ ఎవరూ స్పందించలేదు. ఇటువంటి కథకు కొత్తవారైతే బెటర్‌ అని అప్పుడు మలయాళ నటుడు దేవ్‌ను అడగడం ఆయన చేయడానికి ముందుకు రావడం జరిగింది. దర్శకుడు గుణశేఖర్‌ అంతకుముందు రుద్రమదేవి సినిమా చేశారు. అందులో ఓ కీలకమైన పాత్ర కోసం అల్లు అర్జున్‌ను పెట్టడం, కథను మార్చడం జరిగింది. 
 
అయితే ఈసారి కూడా అలాంటి హీరోను ట్రై చేసినట్లు తెలిసింది. అప్పటికే రుద్రమదేవి తర్వాత రెండు చారిత్రాత్మక కథలతో ప్రతాపరుద్రుడు, హిరణ్యకస్యప సినిమాలు గుణశేఖర్‌చేయాల్సి వుంది. కానీ ఇందుకు పరిస్థితులు అనుకూలించలేదట. అందుకే పట్టుదలతో శాకుంతలం తీసి అంతకుముందు సినిమాల వల్ల నష్టాన్ని పూడ్చడానికి శాకుంతలం తీసినట్లు తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కర్నూల్ అవుట్ డోర్ స్టేడియంలో గోపీచంద్ రామబాణం సెకండ్ సింగిల్