Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కర్నూల్ అవుట్ డోర్ స్టేడియంలో గోపీచంద్ రామబాణం సెకండ్ సింగిల్

Advertiesment
Gopichand, Dimple Hayati
, బుధవారం, 12 ఏప్రియల్ 2023 (18:52 IST)
Gopichand, Dimple Hayati
హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ కలిసి  ‘రామబాణం’తో హ్యాట్రిక్ పూర్తి చేయదానికి సిద్ధం చేస్తున్నారు.  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత.
 
యాక్షన్ అంశాలతో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న 'రామబాణం' గ్లింప్స్‌, ఫస్ట్ సింగిల్ ఐఫోన్ సాంగ్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం సెకండ్ సింగిల్ దరువెయ్యరా పాటని ఏప్రిల్ 14న కర్నూల్ అవుట్ డోర్ స్టేడియంలో జరిగే గ్రాండ్ ఈవెంట్ లో లాంచ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. గోపిచంద్, డింపుల్ హయాతీ పండగ వాతావణంలో సంప్రదాయ దుస్తులలో గ్రేస్ ఫుల్ గా డ్యాన్స్ చేస్తున్న అనౌన్స్ మెంట్ పోస్టర్ ఆకట్టుకుంది.
 
భూపతి రాజా ఈ చిత్రానికి కథను అందించగా, వెట్రి పళని స్వామి సినిమాటోగ్రఫీ, మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. మధుసూదన్ పడమటి డైలాగ్స్ అందించగా, ప్రవీణ్ పూడి ఎడిటర్.
 
జగపతి బాబు, ఖుష్బు ముఖ్య తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రంలో సచిన్ ఖేడేకర్, నాజర్, అలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, సత్య, గెటప్ శ్రీను, సమీర్, తరుణ్ అరోరా తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.
సమ్మర్ కానుకగా మే 5న రామబాణం విడుదలకు సిద్ధమవుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మేమ్ ఫేమస్ లో కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఒక్కో పాటను పాడారు