లక్ష్మణుడుని, హనుమంతుడుని కలిపితే రామబాణం

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 11 January 2025
webdunia

లక్ష్మణుడుని, హనుమంతుడుని కలిపితే రామబాణం

Advertiesment
Gopichand, Jagapathi Babu
, గురువారం, 30 మార్చి 2023 (19:41 IST)
Gopichand, Jagapathi Babu
'లక్ష్యం', 'లౌక్యం' వంటి సూపర్ హిట్ సినిమాల తరువాత మాచో స్టార్ గోపీచంద్, టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీవాస్‌ కాంబినేషన్ లో రూపొందుతోన్న హ్యాట్రిక్ ఫిల్మ్ 'రామబాణం'. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల భారీస్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో గోపీచంద్ సరసన నాయికగా డింపుల్ హయతి నటిస్తుండగా, జగపతి బాబు, కుష్బూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.
 
హిట్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో 'రామబాణం'పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇక నేడు శ్రీరామ నవమి కావడంతో పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ ఓ ప్రత్యేక పోస్టర్ ను వదిలారు. పండుగ వాతావరణాన్ని ప్రతిభింభించేలా గుడి ఆవరణంలో పంచె కట్టు, నుదుటన బొట్టుతో గోపీచంద్, జగపతి బాబు ఒకరి చేయి ఒకరు పట్టుకొని నడిచొస్తున్న పోస్టర్ తెలుగుదనం ఉట్టిపడేలా ఎంతో అందంగా ఉంది.
 
శ్రీరామ నవమి సందర్భంగా పోస్టర్ తో పాటు ప్రత్యేక వీడియోను కూడా విడుదల చేశారు 'రామబాణం' మూవీ టీమ్. "ఆ రాముడుకి లక్ష్మణుడు, హనుమంతుడు అని ఇద్దరు ఉంటారు. ఆ ఇద్దరినీ కలిపితే నేను" అనే బలమైన మాటతో రూపొందించిన వీడియో ఆకట్టుకుంటోంది. ప్రజా నాయకుడిగా జగపతి బాబు కనిపిస్తుండగా.. ఆయనకు అండగా నిలుస్తూ, ఆయన కోసం ఎంత దూరమైనా వెళ్ళే మిస్సైల్ లా గోపీచంద్ కనిపిస్తున్నారు. వీడియోలో గోపీచంద్ మేకోవర్, యాక్షన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గోపీచంద్ స్క్రీన్ ప్రజెన్స్, శ్రీవాస్ టేకింగ్, మిక్కీ జే మేయర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కట్టిపడేశాయి. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా దర్శకుడు శ్రీవాస్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని వీడియోని బట్టి అర్థమవుతోంది. విక్కీ అనే పవర్ ఫుల్ పాత్రలో గోపీచంద్ సరికొత్తగా కనిపించనున్న ఈ రామబాణం చిత్రం త్వరలోనే థియేటర్లలో ప్రేక్షకులను అలరించడానికి దూసుకొస్తోంది.
 
లక్ష్యం, లౌక్యం సినిమాలను మించేలా ఉండాలని శ్రీవాస్ ప్రత్యేక శ్రద్ధతో ఈ చిత్రాన్ని తీర్చి దిద్దుతున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌ తో పాటు సామాజిక సందేశం కూడా మిళితమైన బలమైన కథాంశం ఉన్న చిత్రమిది. గోపీచంద్ 30వ చిత్రం గా వస్తున్న ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేతలు టి.జి. విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఖర్చుకి వెనకాడకుండా ప్రముఖ నటీనటులు, ఉత్తమ సాంకేతిక నిపుణులతో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి కథని భూపతి రాజా అందించగా, ఛాయాగ్రహకుడుగా వెట్రి పళని స్వామి వ్యవహరిస్తున్నారు. చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రల్లో సచిన్ ఖేడ్ ఖర్, నాజర్, ఆలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, సత్య, గెటప్ శ్రీను, సమీర్, తరుణ్ అరోరా తదితరులు నటిస్తున్నారు.
 
తారాగణం: గోపీచంద్, డింపుల్ హయతి, జగపతి బాబు, కుష్బూ
దర్శకుడు: శ్రీవాస్
నిర్మాతలు: టి.జి. విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సంగీతం: మిక్కీ జే మేయర్
డీఓపీ: వెట్రి పళని స్వామి
కథ: భూపతి రాజా
డైలాగ్స్: మధుసూధన్ పడమటి
ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ కుమార్ మన్నె

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మణిరత్నం చూసి అసూయపడుతున్నా : కమల్ హాసన్