Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 2 April 2025
webdunia

గోపీచంద్ రామబాణం మే లో వేయబోతున్నాడు

Advertiesment
Gopichand
, శనివారం, 4 మార్చి 2023 (16:46 IST)
Gopichand
మాచో స్టార్ గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్‌ కాంబినేషన్ ఒకటి. వారి కలయికలో గతంలో 'లక్ష్యం', 'లౌక్యం' వంటి సూపర్ హిట్లు వచ్చాయి. ఇప్పుడు 'రామబాణం' కోసం ముచ్చటగా మూడోసారి చేతులు కలిపిన ఈ జోడి హ్యాట్రిక్ పై కన్నేసింది. పైగా వీరికి వరుస బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతున్న ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ తోడైంది. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా భారీస్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో గోపీచంద్ సరసన నాయికగా డింపుల్ హయతి నటిస్తుండగా, జగపతి బాబు, కుష్బూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
 
చిత్ర ప్రకటన వచ్చినప్పటి నుంచే 'రామబాణం'పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను రెట్టింపు చేస్తూ ఇటీవల మహా శివరాత్రి కానుకగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, 'విక్కీస్ ఫస్ట్ యారో' అనే ప్రత్యేక వీడియో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఆ ప్రత్యేక వీడియోలో గోపీచంద్ స్క్రీన్ ప్రజెన్స్, శ్రీవాస్ టేకింగ్, మిక్కీ జే మేయర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కట్టిపడేశాయి. ఇక ఇప్పుడు ఈ చిత్రం నుంచి మరో కొత్త పోస్టర్ విడుదలైంది. ఇది పరీక్షల సమయం కావడంతో విద్యార్థులను ఆల్ ది బెస్ట్ చెబుతూ మేకర్స్ రామబాణం నుంచి కొత్త పోస్టర్ ను వదిలారు. గోపీచంద్ పవర్ ఫుల్ లుక్ తో ఉన్న పోస్టర్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. అలాగే ఈ చిత్రాన్ని మే 5న విడుదల చేయబోతున్నట్లు పోస్టర్ లో పేర్కొన్నారు. విద్యార్థులందరికీ పరీక్షలు ముగిశాక వేసవిలో మిమ్మల్ని అలరించటానికి, అసలుసిసలు వినోదాన్ని పంచడానికి రామబాణం దూసుకొస్తోంది. ఇందులో విక్కీ అనే పవర్ ఫుల్ పాత్రలో గోపీచంద్ సరికొత్తగా కనిపించనున్నారు. ఈ సినిమాలో గోపీచంద్ మేకోవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
 
లక్ష్యం, లౌక్యం సినిమాలను మించేలా ఉండాలని శ్రీవాస్ ప్రత్యేక శ్రద్ధతో ఈ చిత్రాన్ని తీర్చి దిద్దుతున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌ తో పాటు సామాజిక సందేశం కూడా మిళితమైన బలమైన కథాంశం ఉన్న చిత్రమిది. గోపీచంద్ 30వ చిత్రం గా వస్తున్న ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేతలు టి.జి. విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఖర్చుకి వెనకాడకుండా ప్రముఖ నటీనటులు, ఉత్తమ సాంకేతిక నిపుణులతో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి కథని భూపతి రాజా అందించగా, ఛాయాగ్రహకుడుగా వెట్రి పళని స్వామి, సంగీత దర్శకుడిగా మిక్కీ జే మేయర్ వ్యవహరిస్తున్నారు. చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రల్లో సచిన్ ఖేడ్ ఖర్, నాజర్, ఆలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, సత్య, గెటప్ శ్రీను, సమీర్, తరుణ్ అరోరా తదితరులు నటిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాఘవ లారెన్స్, ప్రియా భవానీ శంకర్ రుద్రుడు ఏప్రిల్ 14న రాబోతుంది