Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వీరసింహారెడ్డి 54 సెంటర్లలో 50 రోజుల పూర్తి

Advertiesment
verrsihareddy 50days
, గురువారం, 2 మార్చి 2023 (16:15 IST)
verrsihareddy 50days
ప్రతి వారం అనేక రిలీజులు స్క్రీన్‌ల కోసం పోటీ పడుతున్న నేపధ్యంలో, థియేట్రికల్ బిజినెస్ 2-3 వారాల వ్యవహారంగా మారింది. ఈ తరుణంలో సినిమా 50 రోజుల పాటు నాన్‌స్టాప్‌గా థియేటర్‌లో నడవడం అరుదైన, పెద్ద విజయం.  
 
నటసింహ నందమూరి బాలకృష్ణ వీరసింహా రెడ్డి సినిమా థియేటర్లలో విజయవంతంగా 50 రోజుల రన్ పూర్తి చేసుకుని, అన్ని వర్గాలకు సంబంధించిన అంశాలతో కూడిన మంచి కంటెంట్ చిత్రాలను పోటీతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఎల్లప్పుడూ ఆదరిస్తున్నారనే వాస్తవాన్ని నిరూపించింది. ఈ చిత్రం 23 డైరెక్ట్, 54 షిఫ్టింగ్ థియేటర్లలో ఈ ఫీట్ సాధించింది. ఇది బాలకృష్ణకు హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.
 
వీరసింహారెడ్డి పూర్తిగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కాదు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో  బ్రీత్ టేకింగ్ యాక్షన్ తో పాటు  ఫ్యామిలీ ఎమోషన్స్,  ఆకట్టుకునే డ్రామా సమపాళ్లలో ఉన్నాయి. బాలకృష్ణ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. శృతి హాసన్ కథానాయికగా నటించగా, హనీ రోజ్, వరలక్ష్మి శరత్‌కుమార్, దునియా విజయ్ కీలక పాత్రల్లో కనిపించారు.
 
మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.ఎస్  థమన్ ఒక చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌ను అందించాడు. వీరసింహారెడ్డి  బాలకృష్ణ, తమన్ కాంబినేషన్‌లో రెండవ బ్లాక్‌బస్టర్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మరో గుడ్ న్యూస్.. అమెరికాలో RRR ఊచకోత..రీ-రిలీజ్