Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎన్‌.టి.ఆర్‌. 30 సినిమా ఓపెనింగ్‌, రిలీజ్‌ డేట్‌ అప్‌డేట్‌

Advertiesment
NTR-koratala
, గురువారం, 16 ఫిబ్రవరి 2023 (09:57 IST)
NTR-koratala
ఎన్‌.టి.ఆర్‌. కథానాయకుడిగా 30వ సినిమాను యువ సుధ ఆర్ట్స్‌ బేనర్‌పై రూపొందుతోంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ధర్మం, అధర్మం కాన్సెప్ట్‌తో రూపొందనున్నట్లు సంస్థ ట్వీట్‌ చేసింది. ఈ సినిమా ఓపెనింగ్‌ ఫిబ్రవరి 24న అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. విడుదల తేదీకూడా ఏప్రిల్‌ 5, 2024న అంటూ ప్రకటించారు. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో విడుదలకాబోతుంది. 
 
ఈ సినిమాలో జాన్వీకపూర్‌, సైఫ్‌ అలీఖాన్‌తోపాటు దక్షిణాది భాషల్లోనే మరికొంతమంది నటించనున్నారు. ఈ ప్రకటన పట్ల నందమూరి అభిమానులు చాలా జోష్‌లో వున్నారు. అన్న ఎన్‌.టి.ఆర్‌.కు సరైన కథ దొరికిందని ట్వీట్‌లు చేస్తున్నారు. కాగా, ఈ సినిమా గురించి మరిన్ని వివరాలను త్వరలో తెలియజేస్తామని యువసుధ సంస్థ తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సార్ అనేది అర్థవంతమైన సినిమా : ధనుష్