Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జేఈఈ మెయిన్స్‌కు దరఖాస్తుల ఆహ్వానం... గడువు మార్చి 12 వరకు..

jee students
, గురువారం, 16 ఫిబ్రవరి 2023 (09:03 IST)
జేఈఈ మెయిన్స్ తుది విడత పరీక్షలకు ఎట్టకేలకు దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. బుధవారం నుంచి ఈ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ దరఖాస్తు గడువును మార్చి 12వ తేదీ వరకు ఇచ్చారు. జేఈఈ మెయిన్స్‌ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మార్చి 12వ తేదీ రాత్రి 9 గంటల వరకు దరఖాస్తు చేసుకోవ్చని జాతీయ పరీక్షల సంస్థ (ఎన్.టి.ఏ) తెలిపింది. 
 
దేశ వ్యాప్తంగా ఏప్రిల్ నెలలో జేఈఈ మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ తుది విడత పరీక్షల కోసం అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల సమర్పణకు ప్రత్యేకంగా ఒక లింకును కూడా అందుబాటులోకి తెచ్చింది. 
 
గతంలో ప్రకటించిన ప్రకారం అభ్యర్థులు ఈ నెల 7వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించుకోవాల్సి ఉంది. ఇందుకోసం దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నప్పటికీ ఎన్.టి.ఏ నుంచి ఎలాంటి స్పందన లేకుండా ఉన్నది. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి ఎన్.టి.ఏ దరఖాస్తులను స్వీకరిస్తున్నట్టు ప్రకటించింది. మొత్తంమీద వారం రోజుల ఆలస్యంగా ఈ ప్రక్రియను ప్రారంభించింది.
 
కాగా, జేఈఈ మెయిన్స్ తుది విడత పరీక్షలు ఏప్రిల్ 6, 8, 10, 11, 12 తేదీల్లో దేశ వ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తారు. అలాగే, ఏప్రిల్ 13, 15 తేదీలను ఎన్.టి.ఏ రిజర్వుడేలు ఉంచింది. ఈ పరీక్షల తర్వాత ఉత్తమ స్కోరును తీసుకుని విద్యార్థులకు ర్యాంకుల జాబితాను ప్రకటిస్తారు. ఈ ర్యాంకుల ఆధారంగా జాతీయ స్థాయిలో ఐఐటీల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ ప్రభుత్వ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ వీఆర్ఎస్ - సీఎం జగన్ ఆమోదం