Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రతిష్టాత్మక సీఈహెచ్‌: సర్టిఫైడ్‌ ఎథికల్‌ హ్యాకర్‌ లెవల్‌ ఎల్‌ 2 సర్టిఫికేషన్‌ సాధించిన 16 మంది కెఎల్‌ విద్యార్ధులు

Advertiesment
KL students
, మంగళవారం, 14 ఫిబ్రవరి 2023 (23:31 IST)
హైదరాబాద్‌లోని కెఎల్‌ డీమ్డ్‌ టు బీ యూనివర్శిటీ యొక్క నైపుణ్యాభివృద్ధి విభాగం, తమ విద్యార్ధులు విజయవంతంగా ఈసీ కౌన్సిల్‌ సర్టిఫైడ్‌ ఎథికల్‌ హ్యాకర్‌ ప్రోగ్రామ్‌ను పూర్తి చేయడాన్ని అభినందించింది. ఈ విద్యా సంస్ధ ఈసీ కౌన్సిల్‌ అకడమియా పార్టనర్‌తో భాగస్వామ్యం చేసుకుని తమ విద్యార్ధుల నైపుణ్యం మెరుగుపరచడంతో పాటుగా సైబర్‌ సెక్యూరిటీ విభాగంలో అంతర్జాతీయ సర్టిఫికేషన్‌ను సైతం అందిస్తుంది.
 
కెఎల్‌ వద్ద శిక్షణ పొందిన 25 మంది ఎలైట్‌ విద్యార్థులలో 16 మంది విద్యార్థులు అర్హత సాధించడంతో పాటుగా అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘సీఈహెచ్‌: సర్టిఫైడ్‌ ఎథికల్‌ హ్యాకర్‌ లెవల్‌ ఎల్‌ 2 సర్టిఫికేషన్‌’ను పొందారు. సైబర్‌ సెక్యూరిటీ విద్య మరియు అక్రిడిటేషన్‌లో అంతర్జాతీయంగా అగ్రగామి సంస్ధగా వెలుగొందుతున్న ఈసీ కౌన్సిల్‌, ఈసీ కౌన్సిల్‌ పార్టనర్స్‌ ప్రీమియం లీగ్‌‌కు అకడమియా భాగస్వామిగా కెఎల్‌ యూనివర్శిటీని  స్వాగతించింది. ఈ యూనివర్శిటీ ఇప్పుడు ఈసీ కౌన్సిల్‌ యొక్క ఏఎస్‌పీఈఎన్‌ పోర్టల్‌, సైబర్‌ సెక్యూరిటీ కెరీర్స్‌ పొందాలనుకునే తమ విద్యార్థులకు తగిన మద్దతునూ అందించేలా ఇతర వనరులనూ అందుబాటులోకి తీసుకురాగలుగుతుంది.
 
కె ఎల్‌ డీమ్డ్‌ టు బీ యూనివర్శిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ జి.పి సారధి వర్మ మాట్లాడుతూ, ‘‘కెఎల్‌ యూనివర్శిటీ వద్ద, మేము మా విద్యార్ధులకు, అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న సైబర్‌ సెక్యూరిటీ రంగంలో విజయం సాధించేందుకు అవసరమైన విద్య, వనరులను అందించేందుకు కృషి చేస్తున్నాము. ఈసీ-కౌన్సిల్‌‌తో మా భాగస్వామ్యం, మా విద్యార్ధులు వారి లక్ష్యాలను చేరుకోవడంలో సహాయపడాలనే మా నిబద్ధతను మరింతగా ప్రదర్శించడంతో పాటుగా సాంకేతిక ప్రపంచంలో సానుకూల ప్రభావాన్నీ సృష్టిస్తుంది. మా విద్యార్ధుల కృషి, పట్టుదల పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. భవిష్యత్‌లో వారు మరింతగా విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాము’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

10 సెకన్లో కూలింగ్ అయ్యే కినౌచి 5 స్టార్ హెవీ డ్యూటీ ప్రో ఎయిర్ కండీషనర్స్‌ని లాంచ్ చేసిన హయర్